ఉలిగా నువ్వున్నావు కటిక శిలను నన్ను కళగా మలచాలనుకున్నావు భరించలేని గాయాలు చేసి చిరునగవును చెక్కావు కన్నీరు రాల్చలేని కళ్ళను చేసి ...మూగ రోదనను మిగిల్చావు కదల్చబడని బండ నుండి చెక్కి నలుగురిలో నిలిపావు పలువురు నన్ను పొగడగా నువ్వు గోప్పవాడవయ్యావు రూపం లేని నాకు నీ స్పర్శతో సొంపైన సోగాసులిచ్చావు .. అందుకే నా 'రాతి' మనసులో నీ రూపును నేను చెక్కుకున్నాను...