1. Have an Interesting Snippet to Share : Click Here
    Dismiss Notice

chalam gari maidanam...

Discussion in 'Posts in Regional Languages' started by chitti1986, Feb 6, 2013.

  1. chitti1986

    chitti1986 New IL'ite

    Messages:
    7
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    chalam garu rasina maidanam ane novel enthamandhi chadivarandi danni meedha opinions and reviews emaina unte cheppagalaru ....andariki namaskarallu:)
     
    Loading...

  2. chitti1986

    chitti1986 New IL'ite

    Messages:
    7
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    emitandi evaruu leraa..ekkada
     
  3. Pallavi4me

    Pallavi4me Platinum IL'ite

    Messages:
    2,318
    Likes Received:
    4,539
    Trophy Points:
    283
    Gender:
    Female
    Nenu maidanam chadavaledu, but I read his "Premalekalu"... adi Naku chala istam and chala intense ga untundhi.
     
    1 person likes this.
  4. chitti1986

    chitti1986 New IL'ite

    Messages:
    7
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    evari rachana andi concept entidi ...premelekalu
     
  5. Pallavi4me

    Pallavi4me Platinum IL'ite

    Messages:
    2,318
    Likes Received:
    4,539
    Trophy Points:
    283
    Gender:
    Female
    Prema Lekalu - Chalam garide.. avi book of letters andi anthe.. ayana avi imaginary manushulaki rasaro or nijamina vallake rasaro teliyadu.. But vatilone feelings baguntayi.
     
  6. chitti1986

    chitti1986 New IL'ite

    Messages:
    7
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    inka vere meeru chadivina manchi rachanallu unte cheppandi nenu yandamuri vaari manchuparvatham chadivanu its very nice meeru kuda try cheyandi.....
     
  7. Pallavi4me

    Pallavi4me Platinum IL'ite

    Messages:
    2,318
    Likes Received:
    4,539
    Trophy Points:
    283
    Gender:
    Female
    Nenu yandamoori books epudu chadavaledu. Mahaprastanam, anatam chadivanu.. Right now, I'm looking for poetry or prose writings of Jashuga garu and also Dasaradi krishnamachaari gari padyalu kuda chala baguntayi.. ave vethukuthunnanu.. Telugu books old classic books websites lo kuda dorakadam ledu, kondamante..

    School times, TAMASI ani oka poetry lesson undedi, chala baguntundhi meaning kuda, kani dorakadam ledu, evarikina idea unte chepandi.
     
    1 person likes this.
  8. chitti1986

    chitti1986 New IL'ite

    Messages:
    7
    Likes Received:
    0
    Trophy Points:
    1
    Gender:
    Female
    vamoo meeru inka chala unique laga unnare nenu eppudippude chadavatam start chesanandi...but anyway if i know any i ll let u know
     
  9. mithra3412

    mithra3412 Platinum IL'ite

    Messages:
    501
    Likes Received:
    2,017
    Trophy Points:
    270
    Gender:
    Female
    తామసి
    ------

    ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
    తరుణి కపోలపాళికలు తాకి, విహాయస వీధి ప్రాకి, చం
    దురు పయి సోకి, భూమిధర దుర్గమ వీధుల దూకి, మెల్లగా
    ధరపయి కాలు మోపిన వుదారములై హరినీలకాంతులన్!
    (నిశాసతి - రాత్రి అనే స్త్రీ, విహాయస వీధి - ఆకాశం)

    ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాననా
    ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
    ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
    భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
    ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణా
    పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
    ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
    చెక్కిలిపై అగర్ చుక్క నునిచి

    వెండికొండపయిన్ మబ్బు విధము దోచి
    చంద్ర కేదారమున లేడి చాయ దిరిగి
    ఆదిశేషునిపై విష్ణువై శయించి
    చీకటులుగూర్చె నందమ్ము లోకమునకు
    (భ్రుకుటికా ధనువు - బొమముడి అనే విల్లు, అంబకము - బాణము, పక్ష్మ భాగము - కనుఱెప్పల వెండ్రుకలు, అగర్ చుక్క - నల్ల చందనంతో పెట్టే బుగ్గ చుక్క)

    ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
    అచ్చోట మధుమాస మవతరించు
    ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
    ఆ వేళల వసంత మందగించు
    ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
    అటనే నవాషాఢ మావహించు
    ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
    ఆ రోజు కార్తిక మ్మాగమించు

    ఇరుల కన్న అంద మెచట కానగ రాదు
    ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము
    ఇరులు లేని నాడు నరులు కానగరారు
    నరులు లేని నాడు ధరణి లేదు

    కబరీభరమ్ములై కనుపించు చీకట్లు
    కలకాల మందాలు చిలుకు గాత
    నల్లకల్వలవోలె ఉల్లసిల్లెడు నిరుల్
    కాసారములలోన గ్రాలు గాత
    నీలిమేఘమ్ములై నింగి బ్రాకెడు తమం
    బాకాశమున నడయాడు గాత
    జవరాలి కనుపాప చాయ దోచెడు సాంధ్య
    మెడదలో వలపు వర్షింతు గాత

    ఇరులె కురులయి, ఝరులయి పరుగులెత్తి
    ఇరులె కరులయి హరులయి ఇంపు నింపి
    ఇరులె విరులయి సరులయి ధరణి నిండి
    ఇరులె నరులకు మరులు కల్పించు గాత

    వెచ్చదనము లేని వెఱ్ఱి దీపమ్ముల
    పెట్టదలచెదేల పిచ్చిదాన
    వర్షధార వోలె వచ్చు చీకట్లలో
    మట్టిదివ్వె నిలుచు మాట కల్ల

    గౌళి నాల్క మీది కంటకమ్ములలోన
    చిక్కుకొన్న యట్టి చిన్న పురుగు
    అంధకారమందు ఆటాడు దీపంబు
    మరు నిముసమునందు మడియ గలదు
    (గౌళి - బల్లి)

    ఆకాశమ్మది చీకటిల్లు, శశి తారార్కావళుల్ మిణ్గురుల్
    లోకంబియ్యిది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మిం
    దాకల్పింపగ జూచెదేల పరిహాసార్థమ్మొ దీపావళీ
    ప్రాకారమ్ములు తామసీధరణి కంపంబల్లదే వచ్చెడిన్

    కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
    ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
    రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
    ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!
    (విభా విభవ అభిరామ - వేకువ కాంతి కలిగిన అందమైన స్త్రీ)


     
    1 person likes this.
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చిట్టి గారు ....


    'మైదానం' నవలలో ఒక పెళ్ళైన స్త్రీ లేచిపోతున్నట్టు చూపించడం వల్లే ఆ నవలని అశ్లీలం అని విమర్శిస్తున్నారు. ఒకవేళ పెళ్ళికాని స్త్రీ లేచిపోతున్నట్టు చూపించి ఉంటే ఆ నవలని సాధారణ ప్రేమ కథ అనుకునేవాళ్ళు. భార్యభర్తల మధ్య ప్రేమ ఉంటే విడిపోవడం జరగదు. రాజేశ్వరి ప్రేమ కొరకు తన భర్తని వదిలి అమీర్ తో వెళ్ళిపోవడం, అమీర్ మోసం చేశాడని మీరా దగ్గరకి వెళ్ళడం చాలా మందికి నచ్చదు. ప్రేమ లేని సంసారం వ్యభిచారంతో సమానం అని చలం గారు అన్నారు. ఈ విషయం అర్థమైనా మైదానం నవలని అర్థం చేసుకోవడం కష్టం కాదు. మైదానం నవలని ఇంగ్లిష్ లో వ్రాస్తే అది సాధారణ ప్రేమ కథ అనుకుంటారు ఇంగ్లిష్ మాట్లాడే దేశాలవాళ్ళు. ఆ నవలని తెలుగులో వ్రాయడం వల్లే విమర్శలు వచ్చాయి.[​IMG]

    చివరిగా నా అభిప్రాయము ఏమిటంటే ....
    మన జీవిత భాగస్వామి ని ఎంతగా ప్రేమించిననూ , కొన్ని సందర్భాలలో ఆకర్షణకు లోనయ్యి
    పర స్త్రీతో / పర పురుషుడితో శృంగారం జరిపిన వివాహులు , తరువాత తాము చేసిన తప్పుకి జీవితాంతం కుమిలిపోఎవారు ఉన్నారు .
    ఒక్కటి మాత్రం నిజం .... ఈ వ్యామోహాలు / ఆకర్షణలు / సుఖాలు అనేవి కేవలం మన వయసు , శరీర ఆకర్షణ ఉన్నంత వరకు మాత్రమె ఉంటాయి .
    కానీ స్వచ్చమైన ప్రేమ మాత్రం ఎప్పటికి నిలచే ఉంటుంది . 'ప్రేమ' అంటే 'ఆత్మ స్వచ్ఛత'. 'నిర్మలమైనది ' ఒక్కమాటలో చెప్పాలి అంటే అసలు చెప్పటానికి పదాలే దొరకని మధుర భావన .........
     
    3 people like this.

Share This Page