1. Have an Interesting Snippet to Share : Click Here
  Dismiss Notice
 2. What can you teach someone online? Tell us here!
  Dismiss Notice
 3. If someone taught you via skype, what would you want to learn? Tell us here!
  Dismiss Notice

స్నేహం ( Friendship )

Discussion in 'Posts in Regional Languages' started by mitrudu2012, Feb 20, 2013.

 1. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  స్నేహం :

  150795_119030034945890_1151413781_n.jpg
  స్నేహమనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి,స్నేహం చేయడం ఒక కళ.చాలా కొద్దిమంది మాత్రమే స్నేహన్ని దేవుడిచ్ఛిన బహుమతిగా భావిస్తారు.రెండు ఆత్మల కలయిక ద్వారా ఉద్భవించే బంధమే స్నేహం...మనం కష్టాల్లో ఉన్నపుడు, ఆపదలో ఆదుకుని ఓదార్పునిచ్చే స్నేహితుల మాటలే మనకు శక్తివంతమైన ఔషధంలా పనిచేస్తుంది.....ఒక ముఖ్యపాత్ర వహిస్తుంది.

  బంధువులద్వారా పొందలేని అభిమానం,ఆప్యాయతా,సహాయసహకారాలు,స్నేహితులద్వారా పొందవచ్ఛు....నా దృష్టిలో స్నేహంలేని జీవితం,శరీరంలో గుండెలేని వంటిది....ఒక మనిషి అభివృద్ది చెందాలన్నా, పతనం అయినా..స్నేహితులపాత్ర ఎక్కువగా ఉంటుంది.స్నేహమనే పుష్పం ఒకసారి వికసించిందంటే దానికి మెరుపు సంతరించుకుని నిగారింపు తీసుకురావటమనేది మన చేతిలో ఉంది .
  ...
  స్నేహితులను సంపాదించినవారే ఆస్తిపరులని నా నమ్మకం,హలో ...అనే చిన్న పదంతో వారి అభిమానం సంపాదించడానికి ,ప్రీతిపాత్రులవడానికి ..ఎంతో దోహదపడుతుంది.మనసే స్నేహానికి ఆభరణం...అలసిసొలసిన హృదయాలకు చిరుగాలి సవ్వడి వంటిది,...అన్ని బంధాలలోకెల్లా పవిత్రబంధం.

  మంచిమిత్రుల్ని ఏర్పరుచుకోవడం, కలకాలం స్నేహాన్ని కొనసాగించటం కూడా ఒక కళే. మిత్రులలో ఉన్న చెడును మొహమాటం లేకుండా చెప్పి వారిని సరైన మార్గంలో తీసుకురావడమే ఒక మంచి మిత్రుడి లక్షణం.
  స్నేహితులు పరాయి దేశంలో నివసించినా, ఎన్నివేలమైళ్ళ దూరంలో ఉన్నా మన మనసు మాత్రం వారికి దూరం కాకూడదు.స్నేహమనే పదానికి ఒక్క మాటలో నిర్వచించలేము.

  స్నేహమనే లతను పెంచి జీవితాంతం వారి మనసున మనసై కలిసిపోతెనే మంచి స్నేహానికి సార్ధకత.బాహ్యసౌందర్యానికన్నా ..మానసిక సౌందర్యం మిన్న,..ఇరువురి ఆలోచనాసరళి ,మనోభావాలు, పరస్పర అవగాహన ఉన్నపుడే బంధం గట్టీపడుతుంది.... గర్వం ,స్వార్ధం, కల్మషం ఇవేవి వారిమద్య రానంతవరకు ఆస్నేహం చిరకాలం వర్ధిల్లుతుంది.

  స్నేహమనే సాగరంలో మనస్పర్ధల అలలు , కెరటాల అలజడులు ..చేధించుకుని వచ్ఛిన తర్వాత మిగిలే మిత్రులే ..ఆప్తమిత్రులుగా పరిగణించవచ్ఛు.
  స్కూలు,కాలేజీరోజుల్లో మిత్రులతో గడిపిన ,ఆనాటి మధురజ్ణాపకాలు,నా మనసున చెరగని ముద్రలే ఎప్పటికీ...ఆ మధురక్షణాల్ని తలచినపుడు మనసు ఆనందంతో నిండిపోతుంది.మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతారు,కానీ, కొంతమందిత్పనే స్నేహబంధం చిగురిస్తుంది....వృక్షంలా ఎదుగుతుంది....నా బాల్యస్నేహితులని ఎన్నటికీ మరువను..ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మేవారిలో నేనూ ఒకదాన్ని. స్నేహామృతాన్ని పొందడానికే ప్రయత్నిస్తాను తప్ప చేజార్చుకోడానికి ప్రయత్నించను..!

  స్నేహమనేపదంలో ,నమ్మకం విశ్వాసం,నిజాయితీ ,ప్రేమించేగుణం ఇంకా ఎన్నో పదబంధాలు మిళితమై దాగున్నాయి.
   
  3 people like this.
  Loading...

 2. moukthika9

  moukthika9 Gold IL'ite

  Messages:
  558
  Likes Received:
  546
  Trophy Points:
  188
  Gender:
  Female
  Pravaraakya Garu, "naaku kavitvam cheppadam raadu" antuune sneham gurinchi kavitvanni kuda maripincheela enta goppaga chepparandi.......:hatsoff
   
  1 person likes this.
 3. Geetamohan

  Geetamohan Bronze IL'ite

  Messages:
  140
  Likes Received:
  47
  Trophy Points:
  48
  Gender:
  Female
  ".నా బాల్యస్నేహితులని ఎన్నటికీ మరువను..ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మేవారిలో నేనూ ఒకదాన్ని. స్నేహామృతాన్ని పొందడానికే ప్రయత్నిస్తాను తప్ప చేజార్చుకోడానికి ప్రయత్నించను..!"
  idi spell mistake aa?
  leka meeru ammayi aa mitrudu garu?
   
  1 person likes this.
 4. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  మౌక్తిక గారు ......
  గీత గారు .....
  స్నేహం గురించి చెప్పిన ఈ పోస్ట్ వాస్తవానికి నేను రాయలేదు ....
  ఎప్పుడో చాలా రోజుల క్రితం ఎక్కడో చదివి .. నాకు నచ్చి బద్రపరుచుకున్నాను ....
  అనుకోకుండా నిన్న నా సిస్టం లో కనిపించింది ....
  పోస్ట్ చెయ్యాలి అనిపించి చేసాను ....
  వాస్తవానికి ఇది రాసిన వారికి చెందవలసిన ప్రశoశలు ....
  నేను ఆ అద్బుత మాటలు మీ ముందుకు తెచ్చిన వాడిని మాత్రమే .......
  వారు ఎవరో కూడా నాకు తెలియదు అండి ..
  కృతజ్ఞతలు ....
   
 5. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  గీత గారు ...
  నేను అబ్బాయినే అండి .....
  నా వయసు 26 జరుగుతూ ఉన్నది ........ :)

   
 6. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  మౌక్తిక గారు...
  నిజ్జంగా నాకు కవిత్వం రాదు అండి....
   
 7. Geetamohan

  Geetamohan Bronze IL'ite

  Messages:
  140
  Likes Received:
  47
  Trophy Points:
  48
  Gender:
  Female
  చాలా మంచి పని చేసారు.
  మంచి కవిత లు మాతో పంచుకొనందుకు ఆనందిస్తూ...

  గీతామోహన్
   
 8. Barbie2013

  Barbie2013 Silver IL'ite

  Messages:
  315
  Likes Received:
  224
  Trophy Points:
  93
  Gender:
  Female
  Mitrudugaru pls answer

   
 9. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  గీత గారు....
  కృతఙ్ఞతలు అండి........
   
 10. mitrudu2012

  mitrudu2012 Platinum IL'ite

  Messages:
  1,202
  Likes Received:
  573
  Trophy Points:
  210
  Gender:
  Male
  బార్బీ గారు....
  ఆల్రెడీ చెప్పాను అండి......
  నేను అమ్మాయిని కాదు అండి ...
  అబ్బాయినే..... వయసు 26 సం,,
  నా ఫోటో " ఫోటో కంమేంట్ ప్లీజ్ ..." లో కూడా పెట్టాను ... చూడగలరు .... :)


   

Share This Page