సోహాన్ హల్వా

Discussion in 'Hyderabad' started by rangalakshmi, Oct 4, 2012.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    కావలసిన పదార్థాలు:
    కార్న్ ప్లోర్(మొక్కజొన్నపిండి): 1cup
    పాలు: 1/2cup
    డ్రైఫ్ర్యూట్స్(బాదం,పిస్తా,ద్రాక్ష, జీడిపప్పు): 1/2cup
    పంచదార: 4cup
    కుంకుమ పువ్వు: కొద్దిగ
    ఎల్లో పౌడర్(కలరింగ్)కొరకు: చిటికెడు
    యాలకుల పొడి: 2tbsp
    నెయ్యి: 1cup
    నీళ్ళు

    తయారు చేయు విధానము:

    1. బాదం, పిస్తాలను కొద్దిగా వేడి నీళ్ళలో 5-10నిమిషాల పాటు నానబెట్టాలి. 10నిమిషాల తర్వాత పై పొట్టు తొలగించి కొద్ది మందపాటిగా స్లైసులుగా కట్ చేసుకోవాలి.
    2. ఒక కప్పులు మూడు టేబుల్ స్పూన్స్ పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వు, ఎల్లో కలర్ వేసి పక్కన పెట్టుకోవాలి.
    3. స్టౌ పై పాన్ పెట్టి అందులో నీళ్ళు పోసి వేడిఅయ్యాక అందులో పంచదార వేసి కరిగే వరకు కలియబెట్టి తర్వాత పాలు పోసి పది నిమిషాల పాటు కాగనివ్వాలి.
    4. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా సిరఫ్ లా తయారయ్యే సమయంలో కార్న్ ప్లోర్ ని కొద్దిగా నీళ్ళలో కలిపి తర్వాత సిరఫ్ లో పోయాలి. ఇప్పుడు తక్కువ మంట మీద బాగా ఉడకబెట్టాలి.
    5. ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమం చిక్కగా దగ్గర పడుతున్న సమయంలో పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు ని అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి.
    6. ఇప్పుడు హల్వా గట్టిపడే సమయంలో కొద్దిగా కొద్దిగా నెయ్యి వేస్తూ కలియబెట్టాలి. అప్పుడే హల్వా మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు అందులో యాలకల పొడిని కలపాలి. ఫైనల్ గా కట్ చేసి పెట్టుకొన్న డ్రైఫ్ర్యూట్స్ ని పైన అలంకరిచుకొని కావలసిన రీతిలో కట్ చేసి పక్కన పెట్టి కొద్ది సేపు చల్లారనివ్వాలి. తర్వాత సర్వ్ చేయాలి అంతే సోహాన్ హల్వా ట్రెడిషినల్ స్వీట్ రెడీ.
     
  2. neni

    neni Senior IL'ite

    Messages:
    65
    Likes Received:
    11
    Trophy Points:
    23
    Gender:
    Female
    Thanks for posting easy recipe that too in teulugu
     

Share This Page