Happy women's day- 2013 ( మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )

Discussion in 'Festivals & Special Days' started by mitrudu2012, Mar 8, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మిత్రులకు & వారి కుటుంబ సభ్యులకు
    మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
    HAPPY WOMEN'S DAY -2013

    bi_womensday_06_mar_10_112502.jpg
    Womens-Day-Wishes.jpg
    happy-women-day-images.gif


    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్*లో ఒక ఊరేగింపును నిర్వహించింది.

    యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్*హెగన్*లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.

    మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసాపు చివరి ఆదివారం నాడు రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

    ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకు పైగా సైనికులు మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

    మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఐక్యరాజ్య సమితి థీమ్*ను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో 2013కి ఐక్యరాజ్య సమితి థీమేంటో తెలుసా.. 2013 :
    "A Promise is a Promise: Time for Action to End Violence Against Women" ఇదే..

    మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు బ్రేక్ వేయాలని, మహిళలపై యాసిడ్ దాడులు, లైంగిక దాడులు వంటి హింసాత్మక చర్యలకు బ్రేక్ వేయాలని ప్రతిజ్ఞ చేయాలంటూ ఐరాస పేర్కొంటుంది. మరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
     
    Loading...

  2. eternalcare

    eternalcare Senior IL'ite

    Messages:
    57
    Likes Received:
    16
    Trophy Points:
    23
    Gender:
    Female
    Wish You Happy Women's Day Dear Friends :))
     
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మహిళా సంరక్షణలో భారతీయ చట్టాలు:



    స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈ సరికే ముగిసిపోయి ఉండేవి. కానీ పురుషాధ్యికత విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుతం ఆవిష్కరణకు అడ్డుపడ్డాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతదేశంలో స్త్రీలను కాచుకోవడంలో చట్టాలను మించినవి మరేవీ కానరావు. భారతీయ సంవిధానంలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంది. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.


    సంవిధానంలోని 14వ అధ్యాయం ద్వారా సమన్యాయం, అధ్యాయం 15 (3) లో జాతి, ధర్మం, లింగం మరియు జన్మస్థానం తదితరాలను అనుసరించి భేదభావం చూపరాదు. అధ్యాయం 16 (1) ని అనుసరించి లోక సేవలో బేధభావం లేకుండా సమానత్వం, అధ్యాయం 19 (1) లో సమాన రూపంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, స్త్రీ మరియు పురుషులను ప్రాణ, దేహపరమైన స్వాధీనం చేసుకోవడంతో వంచించిరాదని అధ్యాయం 21 తెలుపుతుంది. అధ్యాయాలు 23-24 లలో శోషణకు విరుద్ధంగా సమాన రూపంలో అధికార ప్రాప్తి, అధ్యాయాలు 25-28 లలో స్త్రీపురుషులివురికి సమాన రూపంలో ధార్మిక స్వతంత్రత ప్రాప్తి, అధ్యాయాలు 29-30 ల ద్వారా విద్య మరియు సాంస్కృతిక అధికారం సంప్రాప్తించింది.

    అధ్యాయం 32లో సంవిధానపు సేవలపై అధికారం, అధ్యాయం 39 (ఘ) ను అనుసరించి స్త్రీలు పురుషులు చేసే సమానమైన పనికి సమవేతనాన్ని పొందే హక్కు, అధ్యాయం 40లో పంచాయతీ రాజ్ వ్యవస్థ 73 మరియు 74 అధికరణాలను అనుసరించి ఆరక్షణ యొక్క వ్యవస్థ, అధ్యాయం 41 ద్వారా పని లేమి, వృద్ధాప్యం, అనారోగ్యం తదితర అసహాయ స్థితిలో సహాయాన్ని పొందే అధికారం, అధ్యాయం 42లో మహిళా శిశు సంక్షేమ ప్రాప్తి, అధ్యాయం 33 (క) లో పొందుపరిచిన 84వ అధికరణ ద్వారా లోక్*సభలో మహిళలకు తగు ప్రాధాన్యత, అధ్యాయం 332 (క) లోని 84వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రాల్లోని శాసనసభల్లో మహిళలకు తగు ప్రాధాన్యత సంప్రాప్తించాయి.

    చట్టం ఇలా అంటోంది-
    * కార్యక్షేత్రంలో స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి.

    * మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి.

    * ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు.

    * బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉంది.

    * వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు ఉంటాయి. తన ధనాన్ని ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకునే అధికారం ఆమెకు ఉంటుంది.

    * వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    అంగాంగ ప్రదర్శనతో ప్రగతి సాధ్యమా ?

    జీవనోపాధి, పోటీ ప్రపంచంలో ఆధిపత్యం, కోరినంత ధనం, తక్కువ కాలంలో పేరు ప్రతిష్టలు (?) పొందాలనే వ్యామోహ సాగరంలో కొందరు స్త్రీలు మునిగి తేలుతున్నారు. తమ స్వార్థం కోసం సభ్యతా సంస్కృతులకు ఉద్వాసన పలికి మహిళా జగతి యొక్క పవిత్రతను దిగజార్చే దిశగా పరిగెడుతున్నారు. ఆధునికత, స్వేచ్ఛలు సాకుగా ఈ కాలపు టీవీ సీరియళ్లు, సినిమాలు మరియు వ్యాపార ప్రకటనల్లో స్త్రీలు అంగాంగ ప్రదర్శనలు చేస్తూ దిగజారుడుతనానికి ప్రతీకలవుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో మహిళ చేస్తున్న నగ్న ప్రదర్శన గడచిన దశాబ్ద కాలంలో స్త్రీ సాధించిన అత్యున్నత ప్రగతిని (?) పురుష ప్రపంచానికి చాటి చెప్తోంది.

    దగ్గరి దారుల్లో కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకుంటున్నామనే ఆనందంలో స్త్రీ సహజమైన సిగ్గు, మానాభిమానాలకు గుడ్*బై చెప్పి ఆధునికత మహిళకు మేమే మార్గదర్శకులమని బాహటంగా చెప్పుకుంటున్నారు. గ్రామాలు లేదా నగరాల్లోని మహిళలు కుటుంబ సభ్యులైన భర్త లేదా అత్తగారి నుంచి ఎదుర్కునే వేధింపులను న్యాయస్థానాలు, సమాజ సేవాసంస్థల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా, పుట్టింటి వారి మద్దతుతో వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఆఫీసుల్లో పురుష ఉద్యోగులు చేసే లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయాన్ని పొందవచ్చు. అదేసమయంలో దోషులు తగిన శిక్షను అనుభవిస్తారు.

    కానీ అయాచితంగా వచ్చిపడే ధనం, పేరు ప్రతిష్టల మత్తులో పడి తనంతట తానుగా అంగాంగ ప్రదర్శనకు పాల్పడే స్త్రీని మార్చడం ఆ పరమశివునికి కూడా సాధ్యం కాదు. ఇక టీవీ సీరియళ్లలో మహిళా పాత్రలు విశృంఖలతకు అద్దం పడుతున్నాయి. సోదరి, కూతురు, వదిన, తల్లి పాత్రలు తమ హద్దులను చెరిపేసుకుని ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో మద్యం గ్లాసుతో పెత్తనాన్ని చెలాయిస్తున్న వైనం సగటు భారతీయ డ్రాయింగ్ రూమ్*లకు వ్యాపించింది. అప్పడప్పుడు ప్రియుని కౌగిలిలో పరవశాన్ని అభినయించే నాయికామణులు కూడా టీవీ సీరియళ్లలో ప్రత్యక్షమౌతుంటారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఆధునిక భావజాలానికి ఆయా పాత్రలు అద్దం పట్టాయాని భావించాలా? లేక విశృంఖలమైన స్వేచ్ఛకు భారతీయతను అద్దుతున్నారో తెలియని అయోమయంలో సభ్య సమాజం తలదించుకుంటోంది.

    శక్తి స్వరూపిణిగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా బహుముఖ పాత్రలు పోషిస్తూ మానవ సమాజంలో అత్యున్నత స్థానాన్ని పొందిన స్త్రీ, ఇలా తనకుతానుగా దిగజారిపోతుండటం సాధికారత సాధనలో భాగమని భావించాలా? పురుషాధిక్య సమాజంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే మార్గమని అనుకోవాలా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ తనదైన విశిష్ట స్థానాన్ని కాపాడుకునే క్రమంలో ఇలాంటి హేయమైన స్థితికి స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన నవసమాజ నిర్మాణంలో పాలుపంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    హాయ్ ఫ్రెండ్ .......
    Wish u the same....... To u & ur family members


     

Share This Page