Happy Raksha Bandan - Telugu Wishes

Discussion in 'Andhra Pradesh' started by mitrudu2012, Aug 21, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శ్రావణ పూర్ణిమ

    happy rakshabandan


    happy_raksha_bandhan_Anna.jpg
    Happy-Raksha-Bandhan-Picture.jpg




    భారతీయ సంప్రదాయంలో పెద్దలు ఏర్పర్చిన పద్ధతులు మరుగున పడి విదేశీయ సంప్రదాయ మోజులో నిరాదరణకు గురెై వాటి ప్రయోజనాలను నేటి తరం వరకు గుర్తించలేకపోతున్నారు. అటువంటి సంప్రదాయాల్లో రక్షా(రాఖీ) బంధనం ఒకటి. రక్షా బంధనంలోని ప్రయోజనాలలో ఆధునీకత చోటు చేసుకుని రాఖీ పౌర్ణమి వినోద కార్యక్రమంగా కొనసాగుతూ పిల్లలకు మాత్రమే పరిమితమవుతుంది.


    * రక్షా బంధనం:
    పుట్టిన శిశువుకు ఏ కష్టమూ రాకుండా ఉండేందుకు హైందవులు బాల సారెనాడు దెైవాన్ని ప్రార్థిస్తూ, పురోహితుడు మంత్రోచరణ నడుమ శిశువకు కటి(మొలతాడు)రక్ష తొలిసారిగా కడతాడు. ఆ శిశువుకు ఏ దృష్టి దోషము కలుగకుండా దో(భుజానికికట్టే తాయత్తు) రక్షను తల్లి కడుతుంది. వివాహ సమయంలో వధూవరులిద్దరికి నుదిటి మీద పాల(భాషికం) రక్షలు ముతెైదువులు కడుతారు. మానవ జీవితంలో ఏ ఆపదలు సంభవించకుండా ఉంటాయన్న ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఘట్టంలో రక్షా బంధన ఆచారాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు.

    *రాఖీ:
    శ్రావణ మాసంలో చంద్రుడు తనకున్న 15 కళల్లో విరాజిల్లుతూ నిండుగా ఉండే పూర్ణిమ రోజు ‘రాకా’ పిలువబడుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాకా(పూర్ణిమ రోజు) నాడు చెల్లెలు తన అన్న చేతికి రక్షా బంధనం కట్టి మిఠాయిలు తినిపించి భవిష్య జీవితానికి రక్షణగా నిలిచేలా ఆశీర్వాదం పొందుతుంది. ఈ రక్షా బంధన ఆచారం మహాభారత కాలం నుంచి కొనసాగుతుందని వేద శాస్త్ర కోవిదులు తెలుపుతున్నారు. మహా భారత యుద్ధ కాలంలో శ్రీకృష్ణుని చేతికి గాయమవ్వగా వెంటనే ద్రౌపది తన చీర కొంగును చించి ఆ గాయానికి రక్షగా కట్టిందని, కౌర వ సభలో ద్రౌపది వస్త్రాపహరణ ఆపద సమయంలో అన్న శ్రీ కృష్ణుడు చీరలు అందించి ద్రౌపదికి రక్షగా నిలిచాడని పురారణ కథనాలు వెల్లడిస్తున్నాయి. అలానే యమధర్మరాజు చేతికి యమునాదేవి రక్షా బంధనం కట్టడం ద్వారా సకల జీవుల పాప కర్మలను తొలగించే పుణ్య యుమునా నదిగా అవతరించిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ రాఖీ పండుగను మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.

    * జంధ్యాల పూర్ణిమ:
    సనాతన ఆచారాలను, నియమనిష్టలను కచ్చితంగా పాటించే కుటుంబాలలో ఉపనయనం సమయం నుంచి యజ్ఞోపవీతం(జంధ్యం) ధరించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. శ్రావణ పూర్ణిమ నాడు పాత జంధ్యాన్ని విసర్జించి నూతన జంధ్యాన్ని ధరించడ ం ఆనవాయితీగా నేటికి కొనసాగుతుంది. ఈ జంధ్యాన్ని ధరించే సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తారు. జంధ్యాల పూర్ణిమను పురస్కరించుకొని నగరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జంధ్యాలను మాజేటి గోపాల కృష్ణ అందిస్తూ దాని ప్రాశిస్త్యాన్ని, గాయత్రీ మంత్ర మహిమను తెలుపుతున్నారు.

    * హయగ్రీవ జయంతి:
    విద్యా బోధనలను అందించే జ్ఞాన గురువుగా అందరూ పూజించే హయగ్రీవుడి జయంతి శ్రావణ పూర్ణిమ నాడు అందరూ ఘనంగా జరుపుకుంటారు. హయగ్రీవుడు మానవ దేహంతో గురప్రు తలతో, నాలుగు చేతులలో శ్రీహరి ఆయుధాలు, చిహ్నాలను ధరించిన అవతారంలో దర్శనమిస్తారు. పురాణ కథలు ఎలా ఉన్నా జ్ఞాన ప్రధాత హయగ్రీవుడిని శ్రావణ పూర్ణిమ రోజున విద్యార్థులు పూజిస్తే చదువు బాగా కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు.

    * శ్రావణ పూర్ణిమ విశిష్టత :
    శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణమని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఏ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి ఆ పేరు పెట్టారు వేదకోవిదులు. శ్రవణం కార్యసాధక నక్షత్రమని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్ధం అవతరించిన మత్స్య, కూర్మ, వరహా, నారసింహ, వామన, పరుశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి జన్మలతోపాటు కలియుగ ప్రత్యక్ష దెైవంగా కొలువబడుతున్న శ్రీవేంకటేశ్వరుని అవతారంలో కూడా శ్రవణా నక్షత్రం నాడు జన్మించారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. శ్రవణా నక్షత్రం నాడు వేంకటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు నిర్వహించడం అనాధిగా కొనసాగుతుంది.
     
    1 person likes this.
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male



    శ్రావన పౌర్ణమి రోజు జరిగే ఈ పండుగకో కథ ఉంది..



    క్రీ.పూ. 300 సంవత్సరంలో గ్రీకువీరుడు అలెగ్జాండర్ మనదేశంపై దండెత్తి వచ్చాడు. అందరి రాజుల్ని ఓడించిన పురుషోత్తముడిపై పోరుకు వచ్చాడు. అప్పుడు అలెగ్జాండర్ సతీమణి రాఖీ పండుగ గురించి విని ఉండడంతో పురుషోత్తమ మహారాజుకి ఒక రాఖీ రహస్యంగా పంపించింది. ఆ రాఖీని స్వీకరించిన పురుషోత్తముడు, ఆమెను తన సోదరిగా భావించి ఏదైనా వరమడగమని ఆమెతో అంటాడు.

    అంతలో అమె అలెగ్జాండర్*తో జరిగే యుద్ధంలో నీవు ఓడిపోవాలని పురుషోత్తముడితో రక్షా కట్టిన రుక్సానా చెబుతుంది. ఆ మాటను తప్పక తీరుస్తానని పురుషోత్తముడు యుద్ధంలో ఓడిపోతాడు. ఇంత విలువనిచ్చే సంప్రదాయమైన అలనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది.


    శ్రావణ పూర్ణిమ నాడు సోదరీమణుల శడ్రోపితమైన భోజనం చేసి వారికి రక్షా బంధనం కట్టి ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా వర్థిల్లుమని అకాంక్షించి సంప్రదాయంగా వచ్చే పండుగే ఈ రక్షా బంధనం. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రక్షగా చేతికి తోరణం కట్టుకోవడం ఓ ఆచారమైంది.


    అన్నా చెల్లెళ్లు ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలిచే మహాపండగ రక్షా బంధన్. చిన్నా పెద్దా తేడా లేకుండా రాఖీ పౌర్ణమి అందరిలో అనందోత్సాహాలు నింపుతుంది. అన్నాచెప్లూళ్లు..అక్కా తమ్ముళ్లు..ఏ మూల ఉన్నా ఈ పర్వదినాన కలుసుకుంటారు. మమకారాన్ని పంచుకుంటారు.


    భారతీయ సంస్కృతిలో ఇదో గొప్ప సంప్రదాయం. తమ అనుబంధం కలకాలం నిలవాలని అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కడతారు. రాఖీ కట్టిన సోదరీమణులకు సోదరులు ప్రేమగా కానుకలు ఇస్తారు. కుల, మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం ఒక్క భారత్*లోనే కనబడుతుంది.
     
    1 person likes this.
  3. sarada30

    sarada30 Platinum IL'ite

    Messages:
    1,974
    Likes Received:
    2,165
    Trophy Points:
    285
    Gender:
    Female
    wish you a very happy rakhi and may you reach your goal my dear brother all the very best.
     
    1 person likes this.
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    సోదరి సమానురాలు శారద గారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు :)
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    హాయ్ ... ఫ్రెండ్స్ ....

    ఇక్కడ ఉన్న సోదరి-సోదరులకు అందరికీ రాఖీ పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు :)
     
  6. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    Hi mitrudu

    First image lo spelling mistake undi. పధం kaadu పదం



    Thanks for wishing us and sharing this nice post.
     
    1 person likes this.
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    hai mrunaalini gaaru...

    nenu kooda gamaninchanu andi aa spell mistake but adi net lo nundi download chesinadi..
    so alaage upload chesesanu.... but chalaa chala thanks and happy ani spell mistakes ni bagaa gurtunchukuni maree cheptunnanduku ... :)


     
  8. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    maa telugu sir alage nerpincharu mari, emi cheyyanu ? okka mistake kanapadina ten times malli rayinchevaru
    endukochina godava ani tappulu lekunda rasevallam.

    mee posts timely ga bavumtayi. dachukovalanetaga chakka umtayi. mistakes lekapothe inka bavumtundani cheppanu.
     
    1 person likes this.
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    mrunaalini gaaru...

    thanks andi.. miru ilaa correct cheyyatam maaku santoshamu andi....
    max next time nundi konta care teesukuni maree post chestanu spell mistakes lekunda... :)
     
  10. rajinitk4

    rajinitk4 IL Hall of Fame

    Messages:
    3,603
    Likes Received:
    3,223
    Trophy Points:
    308
    Gender:
    Female
    Mitrudu garu meeku kuda rakhi shubakankshalu......... Dhanyavadamulu chala manchi vishayalu matho panchukunnanduku
     
    1 person likes this.

Share This Page