హిందు సంస్కృతి లో వివాహ వ్యవస్థ (Marriage System in HINDU Religion )

Discussion in 'Jokes' started by mitrudu2012, Mar 19, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మన హిందు సంస్కృతి చాలా పురాతనమైనది


    మన హిందు సంస్కృతి చాలా పురాతనమైనది మరియు చాలా గొప్పది.మనం గుర్తుంచడం లేదు. ఇతర దేశస్తులు తెలుసుకొని పాటిస్తున్నారు.
    హిందు సంస్కృతిలో పెళ్ళి చాలా ముఖ్యమైనది. అది ఒక్క సంబరమే కాదు దానికి చాలా విలువ ఉంది.కాని ప్రస్తుతం దానిని వేడుకలా అనుకుంటున్నారు.దండలు , రింగులు మార్చుకోవడం అనుకుంటున్నారు. ఫోటోలకు ,వీడియోలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. పెళ్ళి లో పురోహితుడు పలికే మంత్రాలుకు చాలా అర్ధం ఉంది.

    సంస్కృత పదం "వివాహం" అనగా "ఒక ప్రత్యేకమైన సమర్పణ"

    వాల్మీకి రామాయణం ప్రకారం, జనక మహారాజు సీతను రామునికి ఈ విధంగా పరిచయం చేసాడు. సీతను అర్ధాంగిగా(భార్యగా) స్వీకరించమని కోరెను.

    హిందూ వివాహం ఇద్దరు మనుషులను జీవితాంతం ధర్మ ,అర్ధ,కామ,మోక్షములలో కలిసి ఉండమని చెపుతుంది.ఇది వేద యజ్ఞంగా పరిగణించాలి. రెండు కుటుంబాలను కలుపుతుంది.
    హిందూ వివాహానికి సాక్షిగా అగ్ని దేవుడు ఉంటాడు. హోమం చుట్టూ ఏడూ సార్లు తిరుగుతారు.
    భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రేమ అనేది పెళ్ళి తరువాత మొదలవుతుందని చెప్పబడింది.

    పెళ్ళి ఆవశ్యకత :
    భార్య భర్త రధానికి రెండు చక్రాలు వంటివారు. ఇద్దరు సమానులే. పెళ్ళి తరువాత వాళ్ళని ఇద్దరు మనుషులగా కాక ఒక జంటగా భావించాలి.ప్రస్తుత కాలంలో "ఇగో" మరియు "పెర్సొనల్ ఒపినిఒన్స్" కి ప్రాముఖ్యత పెంచి పెళ్ళి అర్ధాన్ని మార్చారు.

    హిందు సంప్రదాయం ప్రకారం ప్రతి హిందువు మూడు రుణాలను పుట్టుకతో తెస్తారు. అవి ౧. ఋషి ఋణం ౨. దేవ ఋణం ౩. పితృణం

    ఋషి ఋణం : ప్రతి హిందువు వేద జ్ఞానాన్ని గురువుఅల దగ్గర సంపాదించి తరువాత తరాలకు అందించాలి.

    దేవ ఋణం : పంచభూతాలకు ప్రతి ఒక్కరు బాకీ ఉంటారు. సూర్య భగవానుడు ఎండ ఇస్తున్నందుకు, వాయువు గాలికి, వరుణుడు వర్షానికి, భూమి అన్నం పెడుతున్నందుకు మనం యజ్ఞాలు విధిగా చేయాలి.






    పితృణం : మనం మన తల్లితండ్రులకు మనకు ఈ జన్మనిచ్చి దేవుని చేరాడానికి అవకాశం కల్పించినందుకు ఋణపడి ఉండాలి.పెళ్ళి చేసుకొని వంశాభివృద్ధి చేయాలి.
    కాని ప్రస్తుతం కొత్త పోకడలు అనగా సహజీవనం , ఒకే
    లింగ వివాహాలు మొదలగునవి వచ్చి పెళ్ళి ప్రశ్నార్ధకం అయ్యింది.మార్గదర్శకం చూపించాల్సిన కోర్టులు తప్పు దోవ పట్టింస్తున్నాయి. తాగడం, పొగ కాల్చడం , పెళ్ళి కాకుండా సహ జీవనం , చదువుకునే వయసులోనే తోడు ఉండాలని ప్రభోదిస్తున్నాయి. సెలబ్రిటీలగా సినిమా వాళ్ళు చెలామణి అవుతున్నారు.

    పెళ్ళి వేద మంత్రాలలో ఎన్నో అగ్ని దేవుని సాక్షిగా పంచ భూతాల సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణాలు చేయాలి.

    పెళ్ళి జరిగే విధానం :

    స్నాతకం :
    మన ఆచారం ప్రకారం మగ పిల్లవాడు కాశి లో చదువు పూర్తయిన తరువాత బ్రహ్మచర్యం తీసుకోవాలను కుంటే అక్కడే వుండి పోయి సేవ చేస్తూ దేవుని సన్నిధిలో ఉండాలి. ఐహిక విషయాలు అనగా డబ్బు , సంపాదన ,అందం, పిల్లలు, పెళ్లి అనువంటివి మర్చిపోవాలి.

    స్నాతకం అంటే బ్రహ్మచర్యాన్ని వేడడం. ఆ సంధర్బంగా పెంచిన జుట్టు ,గెడ్డం అందంగా చేస్తారు. ఇది పెళ్ళికి మొదటి మెట్టు.

    కాశి యాత్ర :
    పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు ని తన కూతుర్ని పెళ్లి చేసుకొని గృహస్తాశ్రమం లోకి అనుమతి ఇస్తారు. పెళ్ళి కూతుతు అన్నయ్య(తమ్ముడు) తన చెల్లిని(అక్కను) పెళ్లి చేసుకొని జీవితాన్ని ఇంకా బాగా అనుభవించమనంటారు.

    సంకల్పం :
    మనం దేవుని ఎదుట మనస్పూర్తిగా ప్రార్ధన చేయాలి. గణేష్ పూజ చేస్తారు.

    అంకురార్పణం :
    పెళ్ళి కూతురు మట్టి కుండలలో కొండల నుండి తెచ్చిన మట్టితో నింపి తొమ్మిది రకాల గింజలు వేస్తారు. అది మనిషి పుట్టుకకు అనుకరణ.

    గౌరి పూజ:
    పెళ్ళి కూతురతో చేయిస్తారు. పవిత్రతకు పెళ్లి కూతురు ప్రతీక. దేవి పార్వతి శివుని అర్ధనారీశ్వరానికి ప్రతీక. పెళ్ళి కూతురు మగనితో సుఖ,సంతోషాలతో ఉండాలని మనస,వాచా ,కర్మణ, (మనసు,శరీరము) కలవాలని పూజ చేస్తారు.



    కన్యాదానం : పెళ్లి కొడుకుని ’విష్ణువు’ తో పోల్చి పెళ్లి కూతురు తండ్రి పూజ చేస్తారు.

    ...
    ...
    ...
    ...

    పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని విష్ణువుతో పోల్చి తన కుమార్తెను ఇచ్చి అతని ముందు ఏడు తరాలుకు బ్రహ్మలోకం ప్రాప్తించాలని పూజిస్తారు.ఆమెతో సఖ్యంగా ఉండి తరువాత తరం మంచిగా పుట్టాలని దేవుని సన్నిధిలో సుఖంగా ఉండాలని కోరుకుంటారు.
    ఇది పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు మధ్య పరద ఉంచుతారు. అతనికి తన కుమార్తెను ఇస్తున్నట్టు మంచి అణకువ, స్వచ్చమైన,ఆరోగ్యమైన భార్యను ఇస్తున్నట్టు ఒట్టు వేసి చెప్తారు.

    సుముహర్తం (జీలకర్ర బెల్లం ధారణ):

    పరద ఇంక తీయరు మధ్యలో.
    పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాం (అంటె కుండలిని వెళ్లే చోట) పెట్టుకుంటారు.
    అప్పుడు మధ్యలో బట్ట తొలిగిస్తారు. అదే మొదటి సారి పెళ్లికొడుకు పెళ్లికూతురు మొదటిసారి చూసుకుంటారు.


    ఎందుకు జీలకర్ర

    జీలకర్ర బెల్లం కలిపి చేసిన ముద్దలో ఒక రకమైన పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఉంటాయి. మన తలమీద ఒకానొక స్థలం మీద ఆ ముద్ద పెడితే నిద్రాణావస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకొని సహస్రార చక్ర గుండా అగ్న చక్రగుండా (ఈ స్థలంలో మన ఆధ్యాత్మిక మేల్కొపే స్థలం) భృకుటి( రెండు కళ్ల మధ్య ఉన్న స్థలం) ద్వారా ఉత్తేజితం అవుతుంది.ఆ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకే రకమైన మెదడులో ఆలోచనలు కలిగి సంసార జీవితం మీద మంచి అభిప్రాయంతో ఒకే బాటలో నడుస్తారు.

    యొక్త్రధారణ(ఒక రకమైన గడ్డితో తాడు కట్టడం)

    పెళ్లి కొడుకు పెళ్లి కూతురి నడుం చుట్టు ఒక తాడులాంటి ధర్బ (ఒక విధమైన గడ్డి) తో అగ్ని దేవుణ్ణి స్మరిస్తూ కడతాడు.
    దీని అర్ధం : మనం ఒక కష్టమైన పని మొదలుపెట్టినప్పుడు నడుం చుట్టు గుడ్డ చుట్టుకుంటాం. దాని వల్ల వెన్నుపూసకి అదనపు బలం ఇస్తాం. అదే విధంగా పెళ్లి అయిన తరువాత అదనపు బాధ్యతలు వస్తాయి కనుక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి తోడునీడగా ఉంటానని చెప్పడం.


    మాంగల్యధారణం : (మూడు ముళ్లు వేయడం)

    ఇది ప్రధానమైన ఘట్టం హిందూ వివాహంలో.
    మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అనగ ధరించడం అని.
    పెళ్లి కూతురి మెడలో రెండు మాంగల్యాలు పెళ్లి కొడుకు కడతాడు. ఒకటి పెళ్లి కూతురు తరుపునుండి ,మరొకటి పెళ్లి కొడుకు తరపు నుండి. మాంగల్యంకి రెండు బిల్లలు వేలాడుతూంటాయి. ఈ మాంగల్యం రక్షణ, నమ్మకానికి, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. మూడూ ముళ్లు వేస్టాడు. అవి స్తూల శరీర(భౌతిక శరీరం), సూక్ష్మ శరీర(పరబ్రహ్మ) ,కారణ శరీర(ఆత్మ) కి ప్రతిరూపాలు. మనస,వాచ,కర్మణ (నమ్మడం,చెప్పడం,చేయడం) కి ప్రత్రిరూపాలు కూడా. మాంగల్యధారణ జరుగేటప్పుడు పంతులు ఈ మంత్రాలు చెబుతారు

    ....
    ...
    ....
    ....

    తలంబ్రాలు :

    ఇది సరదా కార్యక్రమం.పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరిపై ఒకరు తలంబ్రాలు(అక్షింతలు - సాఫ్రాన్ - పసుపు - బియ్యంలో కలిపుతారు) వేసుకుంటారు. ఇది సంతోషానికి ప్రతీక.

    హోమం :

    అనగా పవిత్రమైన అగ్ని.హోమం (అగ్ని) మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది.హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడు సార్లు తిరిగుతారు.ఈ ఏడు అడుగులు పెళ్లి ఏడు పెళ్లి ప్రమాణాలకి సూచిక.

    ౧. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటాం
    ౨. ఇద్దరం ధైర్యంతో , శక్తితో గుండె నింపుకొని అన్ని అవసరాలని తీర్చుకుంటాం
    ౩. ఇద్దరం కలిసి కుటుంబ సుఖం కోసం , సంఘం వర్ధిల్లడం కోసం పాటుపడతాం
    ౪. కష్టసుఖాలలో కలిసి ఉంటాం
    ౫. కలిసి మంచి బుద్ధులు వచ్చేటట్టు పిల్లల్ని పెంచుతాం
    ౬. ఇద్దరం కలిసి సుఖ,శాంతి కోసం పాటుపడతాం. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం.
    ౭. జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటాం.



    నాగవల్లి :

    ఒక సిల్క్ ఉయ్యాల తయారు చేసి దానిలో చందనం కర్ర ముక్క, పండిన అరటి పండు(లేక మామిడి పండు) మరియు పసుపు ఒక పళ్లెంలో ఉంచుతారు. పండిన పండు ఆరోగ్యవంతమైన , పసుపు పవిత్రమైన , చందనం స్వయం సుగంధమైన అందరికి మంచిని పంచే మంచి పిల్లలు కలగాలని ఈ కార్యక్రమం చేస్తారు.

    దీని తరువాత ఒక సన్నని(ద్వారం) బిందెలో ఉంగరం వేసి పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురుని ఒకే సారి చేయి పెట్టి ఎవరు ఉంగరం ముందు తీస్తారో చిన్న సరదా పోటి కార్యక్రమం పెడతారు.

    సన్నికల్లు:

    పెళ్లి కూతురి ఎడమ బొటను పేలుని పట్టుకొని సన్నికల్లు మీద పెళ్లి కొడుకు పెట్టిస్తాడు. పక్కనే అగ్ని జ్వలిస్తూంటుంది. ఆ సమయంలోని మంత్రాలర్ధం "ఈ రాయిని ఎక్కు. మన మెదడుని రాయిలా జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి చలించక స్థిరంగా ఉందాం" అని ప్రమాణం చేస్తారు. తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మెట్టెలు (సిల్వర్ రింగులు) కాళ్ల వేళ్లకి పెడతాడు.

    తరువాత పంతులు అరుంధతి(మహర్షి వశిష్టుని భార్య) నక్షత్రాన్ని చూపిస్తూ అరుంధతి తల్లి పవిత్రత గురించి చెప్పి అలా ఆదర్శ గృహిణిలా ఉండమని అరుంధతి దీవెనలు వధూవరులు తీసుకుంటారు.

    పాణి గ్రహణం :

    దీని అర్థం ఒకరి చేయిని ఒకరు పట్టుకోవడం. ఇది చాలా ముఖ్యమైనది. పురోహితులు ఈ కార్యక్రమాన్ని పుణ్యకాలంలో చేయిస్తారు. పెళ్లి కూతురు కుడి చేయి వేళ్లని శంఖం ఆకారంలో ముడిచి పెళ్లి కొడుకు అదే విధంగా పెట్టి పెళ్ళి కూతురు వేళ్లని పట్టుకుంటాడు. పెళ్లి కూతురు చేయి పైకి పెళ్లి కొడుకు చేయి కిందకి ఉండేటట్టుగా పట్టుకుంటారు.

    పెళ్లి కొడుకు కింది విధంగా ప్రార్ధన చేయాలి:

    అర్ధాంగి! ఈ రోజు నీ చేయిని అందరి ముందు పట్టుకున్న. నీతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పిల్లలను కనిపెంచాలని తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. లక్ష్మీ దేవి కటాక్షంతో నిన్ను,మన పిల్లల్ని గుడ్డ,బట్ట,తిండి,చదువు ,ఐశ్వర్యం, సంతోషంతో ఉంచాలని ఆ తల్లిని ప్రార్ధిస్తున్నా. నేను అందరి ముందు నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నా. వాయు దేవుడు అన్ని దిక్కులు వెళ్లి అందరికి బంగారం పంచాలని, అగ్ని దేవుడు అందరి ఆహారం సమకూర్చాలని , నీవు నన్ను సర్వదా సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాను.


    లజ హోమం :

    పురోహితుడు నూతన దంపతులతో హోమం లో ఉబ్బిన బియ్యం వేయిస్తారు.ఇలా చేయడం ద్వారా వధువు వరుని ఎక్కువ కాలం జీవించాలని పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది.పుట్టింటి వారు , మెట్టింటి వారు కలిసి ఉండాలని హొమం చుట్టూ మూడు సార్లు వధూవరులు ఉబ్బిన బియ్యం వేస్తూ ప్రార్ధిస్తారు.


    పెళ్లి కూతురుకి నడుం చుట్టు కట్టిన దర్బా ని తొలగించడం :

    పెళ్లి కూతురు క్రింది విధంగా ప్రార్ధనలు చేస్తు దర్బని తొలగిస్తుంది.

    ఈ వరుని కట్టిన పరమేశ్వరుడు ఇచ్చిన దర్బని తొలగిస్తు నిన్ను నాతో సుఖసంతోషాలను పంచుకుంటు బ్రహ్మ లోకం చేరుదాం.నేను అనుమతి ఇస్తున్న నీకు ఆ దర్బ లేకుండ నాతో సుఖంగా ఉండవచ్చు అని.
     

Share This Page