ప్రేమకు వేళాయరా ( Happy Valentiens Day )

Discussion in 'General Discussions' started by mitrudu2012, Feb 14, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    హాయ్ .... !! :)
    మన " ప్రేమకు వేళాయరా ...! " థ్రెడ్ కు " స్వాగతం -సుస్వాగతం " . :welcome
    " ప్రేమికులరోజు " సందర్భముగా ప్రారంభించిన ఈ థ్రెడ్ లో మీ మనసుని దోచిన మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకున్న మధురానుభూతులు , ఎవరికీ ఎవరు ముందుగా తమ ప్రేమను తెలియపరిచారు , ఎలా చెప్పారు , ఎలా ఒప్పించగలిగారు .... వంటి అనుభూతులని మన మిత్రులతో పంచుకోవాలి అనుకునే మిత్రుల కోసమే ఈ థ్రెడ్ .....
    ఇంకా ఎందుకు ఆలస్యము ?
    మీ మధురానుభూతులు ని పంచేసుకోండి మరి ..... :thumbsup
    122.jpg
     
    Last edited: Feb 14, 2013
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: ప్రేమకు వేలాయరా ( Happy Valentiens Day )

    ప్రపంచాన్ని నడిపించే ఓ అద్భతం ప్రేమ. హృదయాల్ని పరవశింప చేసే ఓ పరిచయం ప్రేమ. జగత్తును నడిపించే ఓ గమ్మత్తు ప్రేమ. ఒకరి కోసం మరొకరు చేసే త్యాగానికి నిలువెత్తు గురుతు ప్రేమ. మనిషి సంబంధాల్లో ప్రేమకు ఎప్పుడూ అగ్రస్థానమే. అందుకే ప్రేమ గురించి ఎన్ని చెప్పినా తక్కువే.. అలాంటి ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల రోజు. స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించే ప్రతిఒక్కరికి వాలెంటైన్స్ డే ఓ సరికొత్త రోజు. ప్రేమ.. ఇద్దరు మనుషుల మధ్య అల్లుకున్న ఓ తియ్యని బంధం. రెండు హృదయాల నడుమ పెనవేసుకుపోయిన అనుబంధం. ఎప్పుడు నేనున్నానంటు నీడల తోడుండే ఓ ఆత్మీయ స్నేహం ప్రేమ. అలాంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. రాస్తూ పొతే పేజీలే మిగలవు. అందుకే ప్రేమ ఇజికోల్ట్ ప్రేమ అంటాడో లెక్కల ప్రేమికుడు. ఎవ్వరి భావన ఎదైనా ప్రేమ మాత్రం వెలకట్టలేనిది. విడదీయడానికి మనిషికి సాధ్యం కానిది.
    ప్రేమ అంటే అంతా మంచే ఉంటుందని మాత్రం భ్రమపడకండి. ప్రేమ ముసుగులో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమించడమంటే స్వాధీనం చేసుకోవడమేనన్నట్టు వ్యవహరిస్తున్న కొందరు యువతీయువకుల తీరు.. ప్రేమకు మాయని మచ్చగా మిగులుతుంది. ప్రేమ పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలు .. యాసిడ్ దాడులు ప్రేమ పట్ల ఉన్న నమ్మకాలని చెరిపేస్తున్నాయి. అమ్మ నాన్న ఆశయాలు.. భవిష్యత్తును నిలబెట్టే చదువులను దూరం చేసే యువతీయువకుల ప్రేమలు కుటుంబాల్లో, జీవితాల్లో చిచ్చుపెడుతూనే ఉన్నాయి.
    ఇక ప్రేమ పేరుతో యువత చేస్తున్న వెకిలి చేష్టలు.. పెద్ద మనుసులను గాయం చేస్తున్నాయి. కండ్ల ముందే బంగారు భవిష్యత్తు ఉన్నా బిడ్డలు ఆగమైపోతుంటే కన్నవాళ్ల గుండెలు విలవిల్లాడిపోతున్నయి. కొన్ని సందర్భాల్లో .. పట్టుదల కోసం పెద్దలు..పంతం కోసం పిల్లలు కలిసి ప్రేమను అభాసుపాలు చేస్తున్నరు. అమృతం లాంటి ప్రేమకు హాలాహలం అనే పెయింటింగ్ వేస్తున్నరు. ఏదీ ఎమైనా ప్రేమ ప్రేమగా నిలబడాలి. అందరి గుండెల్లో జ్యోతిలా వెలిగుండాలి. ఏ స్వార్ధం లేని పసిపిల్లల బోసి నవ్వులా, చీకట్లో తళక్కున మెరిసే మినుగురు పురుగు కాంతిలా కలకాలం నిలిచిఉండాలి.. ప్రేమ తోడుగా, నీడగా మానిషితనం నిలబడలి. జీవితానికి గుర్తుగా ఎప్పటికి చరిత్రలో నిలిచిపోవాలి. ప్రేమ కోసం క్షణ క్షణం నిరీక్షించే హృదయాలకు ప్రేమికులు రోజు శుభాకాంక్షలతో.



     
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: ప్రేమకు వేలాయరా ( Happy Valentiens Day )

    ప్రేమికులరోజు శుభాకాంక్షలు .......
    fgfdg.jpg
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: ప్రేమకు వేలాయరా ( Happy Valentiens Day )

    ప్రేమికులరోజు శుభాకాంక్షలు .......

    hhjj.jpg
     
  5. Anvitha

    Anvitha Moderator Staff Member Gold IL'ite

    Messages:
    955
    Likes Received:
    292
    Trophy Points:
    140
    Gender:
    Female
    Re: ప్రేమకు వేలాయరా ( Happy Valentiens Day )

    title should be ప్రేమకు వేళాయరా .
    అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు .
    మాదీ ప్రేమ వివాహమే కానీ చాల పాత సంగతి . ముందు తరం ప్రేమలు ఫోన్స్ అంటే ల్యాండ్ లైన్ మాత్రమే అది అందరి ఇళ్ళలో ఉండేవి కావు అప్పటి రోజులవి .
    ఏదో మొత్తానికి కధ సుఖాంతమే మరి
     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: ప్రేమకు వేలాయరా ( Happy Valentiens Day )

    అన్విత గారికి ....
    కృతజ్ఞతలు ........
    మీకు , మీ శ్రీవారికి ప్రేమికులరోజు శుభాకాంక్షలు........




     

Share This Page