తెలుగు - వెలుగు ( Telugu - Velugu )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 21, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    తెలుగు - వెలుగు :
    45.jpg

    మిత్రులకు ..... :)

    మన "తెలుగు - వెలుగు" థ్రెడ్ కు స్వాగతం-సుస్వాగతం.
    ఇందులో మన తెలుగు భాష / సంస్కృతి/సంప్రదాయము కి సంభదించిన సమాచారము ఒకరితో ఒకరు పంచుకోవటం కోసము ఏర్పాటు చేయటమైనది .
    ఇందులో చిన్న చిన్న తెలుగు పదాలకు అర్ధాలు మొదలుకుని ...
    పద్యాలు మొ ,, ఏదైనా సరే .... ఇక్కడ పోస్ట్ చెయ్యవచ్చును ....
    మనకు తెలిసినవి , నలుగురితో పంచుకుని మనమూ కొంత జ్ఞానాన్ని పొందుదాము...
    ఇంకా ఆలస్యము ఎందుకు మిత్రులారా .... ?
    మరి .. ప్రారంభించండి మీ పోస్ట్ లను ....... :thumbsup

    కృతజ్ఞతలతో ......
     
    2 people like this.
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ...
    44.jpg
     
    2 people like this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    యెల్ల నృపులుగొల్వ నెరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స


    --- సాహితీ సమరాంగణ చక్రవర్తి : శ్రీకృష్ణదేవరాయులు

     
    1 person likes this.
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మిత్రులారా ...
    మనం చిన్నప్పటినుండి మన పెద్దలు చెప్పగా , మనం చదవగా , వినటం మూలంగా "కళలు" ఎన్ని అంటే ?
    టక్కున 64 అని చెప్పెస్తాము కదూ... ?
    మరి ఆ 64 కళలు ఏంటో తెలుసుకుందామా?


    64 కళలు :


    ఇతిహాసాములు
    ఆగమములు
    కావ్యములు
    అలంకారములు
    నాటకములు
    గానం
    కవిత్వం
    కామశాస్త్రం
    దురోదరం
    దేశభాష విజ్ఞానం
    లిపి కర్మ
    వాచకము
    సర్వ విధ అవధానములు
    స్వర శాస్త్రము
    శకున శాస్త్రము
    సాముద్రికము
    రత్న శాస్త్రము
    రథ కౌశలము
    అశ్వ కౌశలము
    గజ కౌశలము
    మల్ల శాస్త్రము
    సూద కర్మ
    దోహదము
    గంధవాదము
    ధాతు వాదము
    ఖని వాదము
    రస వాదము
    జల వాదము
    అగ్ని స్తంభనం
    ఖడ్గ స్తంభనం
    జల స్తంభనం
    వాక్ స్తంభనం
    వయః స్తంభనం
    వశీకరణం
    ఆకర్షణము
    మోహనము
    విద్వేశము
    ఉచ్చాటనము
    మారణము
    కాల వంచనము
    పరకాయ ప్రవేశము
    పాదుకా సిద్ధి
    వాక్సిద్ది
    ఇంద్ర జాలము
    అంజనము
    పర దృష్టి వంచనము
    పర వంచనము
    మణీ మంత్రౌశాధ సిద్దులు
    చొర కర్మం
    చిత్ర కర్మ
    లోహ క్రియ
    అస్మ క్రియ
    మృత క్రియ
    దారు క్రియ
    వేణు క్రియ
    చర్మ క్రియ
    అంబర క్రియ
    అదృశ్య కరణం
    దండ కరణం
    వాణిజ్యము
    పాశుపల్యము
    కృషి
    ఆసవ కర్మ
    లావకుక్కుట మేషాది యుద్ధ కారక కౌశలము
     
    Last edited: Feb 21, 2013
    3 people like this.
  5. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    మరొక మంచి థ్రెడ్ తో మీరు రెడీ అయ్పోయారు.. చాల బావుంది ప్రవరాఖ్య గారు..
     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    బున్నీ గారు...
    కృతఙ్ఞతలు అండి ....
    ఉమ్.... ఎదో ఆలోచిస్తుంటే ఇలా ఒక థ్రెడ్ ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది అండి....
    అందుకే ... మీ వంతుగా మీరు కూడా మీకు తెలిసినవి మన మిత్రులకు తెలియపరచగలరు.... ఆనందపరచగలరు ... :)
    భోజనము చేశారా?


     
  7. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    శ్రీ తెనాలి రామాక్రిష్ణుడు (అల్లసాని పెద్దన కవిని "అమవస" అనే మాట వాడినందుకు వెటకరిస్తూ)
    ఎమి తిని సెపితివి కవితము
    భ్రెమ పడి వెరి పుచ్చ కాయ మరి తిని సెపితో
    ఉమెతక్కయ తిని సెపితో
    అమవస నిసి యన్న మాట నలసని పెదనా !!
     
    Last edited: Feb 22, 2013
    1 person likes this.
  8. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    ఉప్పు కప్పురంబు నొక్క పొలిక నుండు
    చూడ చూడ రుచులు జాడ వేరు
    పురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
    విస్వదాభిరామ, వినుర వేమ !


    గంగి గోవు పాలు గరిటడైనను చాలు
    కడివెడైననేమి ఖరము పాలు
    భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
    విశ్వధాభిరామ, వినుర వేమ
     
  9. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    చేతులారంగ నిన్ను పూజించుకొరకు
    కోడి కూయంగనే మేలుకొంటి నేను;
    గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
    పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

    నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
    రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
    ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
    మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

    తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
    ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
    అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
    హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

    జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
    బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
    బండబారె నటోయి నీ గుండెకాయ!
    శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

    ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
    తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
    నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
    హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

    గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
    గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
    త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
    తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

    ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
    ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
    శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
    త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

    ఊలు దారాలతో గొంతు కురి బిగించి
    గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
    ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
    అకట! దయలేని వారు మీ యాడువారు

    గుండె తడి లేక నూనెలో వండి పిండి
    అత్తరులు చేసి మా పేద నెత్తురులను
    కంపు దేహాలపై గుమాయింపు కొరకు
    పులుముకొందురు హంత! మీ కొలము వారు.

    అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
    ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
    ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
    రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

    మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
    జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
    యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
    మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

    బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
    సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
    అందమును హత్య చేసెడి హంతకుండ!
    మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

    పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
    కోయ బోకుము మా పేద కుత్తుకలను
    అకట! చేసేత మమ్ముల హత్య చేసి
    బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

    ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
    నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
    ఏమి తోచక దేవర కెరుక సేయ
    వట్టి చేతులతో ఇటు వచ్చినాను.

    ఇది కరుణశ్రీ వారి " పుష్ప విలాపం"
     
  10. mrunalini01

    mrunalini01 Moderator Staff Member Platinum IL'ite

    Messages:
    1,402
    Likes Received:
    616
    Trophy Points:
    215
    Gender:
    Female
    (ప్రెగడరాజు నరస కవితో వాదన సందర్భంలో)

    త్పృవ్వట బాబా తల పై
    బువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
    బువ్వట చూడగ హుళులు
    క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!

    ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
    దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్
    మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
    సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !!

    తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
    పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
    పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
    రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

    (".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)
     

Share This Page