[h=2] ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ [/h][h=2]శుభాకాంక్షలు [/h][h=2] [/h][h=2] మాతెలుగు తల్లికీ మల్లెపూదండ - మాకన్నతల్లికీ మంగళారతులు - కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి![/h] [h=2]||మాతెలుగు తల్లికీ||[/h] [h=2]గల గల గోదారి కడలి పోతుంటేను… బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను… బంగారు పంటలే పండుతాయి! మురిపాల ముత్యాలు దొరలుతాయి![/h] [h=2]||మాతెలుగు తల్లికీ||[/h] [h=2]అమరావతీ నగర అపురూప శిల్పాలు - త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు -[/h] [h=2]తిక్కయ్య కలములో తియ్యందనాలు -[/h] [h=2] నిత్యమై నిఖిలమై నిలిచియుండే దాక - [/h] [h=2]మొల్ల కవితా శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి - మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం! – నీ పాటలే పాడుతాం![/h] [h=2]||మాతెలుగు తల్లికీ||[/h] [h=2]రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు -[/h] [h=2]గోపన్న గొంతులో కొలువైన రాగాలు -[/h] [h=2]పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు -[/h] [h=2]పోతన్న కవన మందార మకరందాలు -[/h] [h=2]రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, [/h] [h=2]మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి -[/h] [h=2]మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …[/h] [h=2]నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం -[/h] [h=2]జై తెలుగుతల్లి ![/h] [h=2]జై తెలుగుతల్లి !! [/h] [h=2]జై తెలుగుతల్లి !!![/h]
Re: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్ Mitrudu garu meeku mariyu mana telugu snehithulandariki andhrapradesh avatarana dinotsavam subhakankshalu.