మాలతీ చందూర్ కన్నుమూత (malathi chandoor passedaway)

Discussion in 'Andhra Pradesh' started by mitrudu2012, Aug 23, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ప్రముఖ కాలమిస్ట్, రచయిత్రి మాలతి చందూర్ కన్నుమూత

    Malathi-candoor-Banner.jpg


    బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రచయిత్రిగా పేరుపొందిన మాలతీ చందూర్ ఇక లేరు. ఆమె బుధవారం సాయంత్రం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. 1930లో ఆంధ్రప్రదేశ్*లోని కృష్ణా జిల్లా నూజివీడులోని జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు ఆరవ సంతానంగా మాలతి జన్మిం చారు. నూజివీడులోనూ, ఏలూరులోనూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1947 మేనమామ అయిన చందూరి నాగేశ్వరావును పెళ్లి చేసుకున్నారు. అనంతరం మాలతి జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఎన్*ఆర్ చందూర్ స్వతహాగా పాఠకుడు, రచయిత, సంపాదకుడు కావడంతో ఆయన మాలతి దృష్టిని సాహిత్యం వైపునకు మరల్చి తొలి గురువు అయ్యారు. ఏలూరులోని సాహిత్య మండలితో ఉన్న ఆమెకున్న అనుబంధం సైతం మాలతిని సాహితీ రంగం వైపుకి మరలేలా చేసింది.

    ‘శరికం’ అనే నాటకంలో మాలతి ఒక పాత్రను కూడా పోషించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, చలం వంటి వారి పుస్తకాలను ఆమెను సంపూర్ణమైన రచనా వ్యాసాంగంలోనికి దించాయి. అందుకే ఆమె ‘పుట్టిన రోజులకు పుస్తకంను మాత్రమే బహుమతిగా ఇవ్వండి’ అంటూ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మాలతీ చందూర్ రాసిన పలు పుస్తకాల్లో మధుర స్మృతు లు, చంపకం, చెదపురుగులు, లావణ్య, ఏది గమ్యం - ఏది మార్గం?, రేణుకా దేవి ఆత్మకథ, క్షణికం, ఏమిటీ ఈ జీవితాలు?, రాగరక్తిమ, బ్రతక నేర్చిన జాణ, జయలక్ష్మీ - కృష్ణవేణి, వైశాఖి వంటివి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం లభ్యం కావడం లేదు. 1950లో ఆమె రాసిన ఁరవ్వల దిద్దులురూ. అనే తొలి కథ ఆనంద వాణిలో ప్రచురితమైంది. భారతి మాస పత్రికలో లజ్ కార్నర్, నీరజ కథలు ప్రచురితమయ్యాయి. పాప, తనూ - నీరజ శానమ్మ, జాలీ, విలువెంత, ఏడు కొండలవాడా, జమున వంటి కథలు ఆమెను ఒక రచయిత్రిగా నిలిపాయి. మాలతి కథల్లో చెన్నై నగరం ప్రధాన ఇతివృత్తం కావడం గమనించదగిన విశేషం.

    సుమధుర వంటలూ - కూరలు - పచ్చళ్లూ అనే పలు వంటల పుస్తకాలను కూడా ఆమె రచించారు. మహిళలకు మధుర జీవనం, అందాలు - అలంకారాలూ ఆమె మహిళల కోసం రాసిన పుస్తకాలు. ఉన్నత విద్యను అభ్యసించపోయినా పట్టుదలతో ఆంగ్లాన్ని అభ్యసించి అనేక రచనలను తెలుగులోకి అనువదించారు. మాలతీ చందూర్ ఆలిండియా రేడియో మద్రాసు - బి స్టేషన్ నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. రెండేళ్ల క్రితం భర్త ఎన్*ఆర్ చందూర్ రమణించడంతో ఆమె తన రచనా వ్యాసాంగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆ సమయాన్ని దుర్గాబాయ్ దేశ్*ముఖ్ సేవా సంస్థలోని సేవా కార్యక్రమాలకు, అమరజీవి పొట్టి శ్రీరాములు సంఘం కార్యకలాపాలకు వెచ్చిస్తూ కాలం గడిపారు. ఆమె మరణంతో తెలుగు సాహితీ లోకం మరొక ధ్రువతారను కోల్పోయింది.
     
    Last edited: Aug 23, 2013
    1 person likes this.
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: మాలతీ చందూర్ కన్నుమూత (malathi chandoor passaway)

    మాలతీ చందూర్ గారి " నన్ను అడగండి చెబుతా " కాలం ఇప్పటికీ తెలుగు వారపత్రిక "స్వాతి" లో ఇప్పటికీ , ఇంతవయసులో కూడా నిర్వహించటం ఆమె గొప్పతనం .... నేను చాలా చదివాను ఆమె సమాదానాలు .. నిజంగా ఆమె ఒక "విజ్ఞాన భాండాగారము " , ఆమెకు తెలియని విషయము ఏమి ఉండదా అనిపిస్తుంది ... గల్లీ నుండి ప్రపంచ విషయాలు అన్ని చక్కగా చెప్పేవారు .... కానీ కొన్ని సార్లు స్త్రీ పక్షపాతిగా ఆమె సమాదానాలు అనిపించినా కూడా ...
    తెలుగు తల్లి ఒక మంచి సాహితీవేత్త , నిజాయతీపరురాలుని కోల్పోయింది అనటంలో సందేహం లేదు .....

    ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ .....
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: మాలతీ చందూర్ కన్నుమూత (malathi chandoor passaway)

    మాలతీ గారి గురించి మీ అభిప్రాయలు తెలియజేయగలరు .....
     
  4. rachaputi

    rachaputi Platinum IL'ite

    Messages:
    1,866
    Likes Received:
    4,388
    Trophy Points:
    285
    Gender:
    Female
    Re: మాలతీ చందూర్ కన్నుమూత (malathi chandoor passaway)

    thats really heartbreaking news.. I love her lot.. Her analyzing too good for the concepts.. Lost one great writer and analyzer..

    Her soul may rest in peace.
     
    1 person likes this.
  5. rachaputi

    rachaputi Platinum IL'ite

    Messages:
    1,866
    Likes Received:
    4,388
    Trophy Points:
    285
    Gender:
    Female
    Nenu swathi booklo open chese first page malathi chandoorgaride.. Nijamga vignana bandagarame ame.. ameki teliyani, analyze cheyaleni concept ee ledu.. Oh god inka ame stories kanapadavanamata swathilo.. Great loss to swathi and telugu people
     
    1 person likes this.
  6. Twinkel

    Twinkel Platinum IL'ite

    Messages:
    2,400
    Likes Received:
    2,917
    Trophy Points:
    285
    Gender:
    Female
    Sad :-( RIP
     
    1 person likes this.
  7. rachaputi

    rachaputi Platinum IL'ite

    Messages:
    1,866
    Likes Received:
    4,388
    Trophy Points:
    285
    Gender:
    Female
    Devudu prapanchaniki emi ichina ivvakapoina, ilanti varini mathram kachitamga pampali. Boomi meeda unna donga babalani 100 mandini teesukupoi, ilanti vyakthini okkarini unchakudada.. mana andariki oka Icon lanti varu.

    Oka life ni ela jeevinchalo, ela tappu oppuluni analyze chesukovalo, nadatha, nadavadika nerpe vyaktulu.. Nijamga rachanalu jeevitanni prabhavitam cheyagalavu ane vatiki oka example malathi chandoor..

    Hats off to her..
     
    1 person likes this.
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    rachaputi gaaru...

    chala chalaa chakkaga chepparu..... 100% true .......


     
    1 person likes this.
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    rachaputi gaaru...
    meeku doga baba la mida kopam peekaladaaka unnatlundi ... :)
     
    1 person likes this.
  10. rajinitk4

    rajinitk4 IL Hall of Fame

    Messages:
    3,603
    Likes Received:
    3,223
    Trophy Points:
    308
    Gender:
    Female
    Very Sad News. May her soul RIP. Malathi chandoor gari columns chadivanu swathi lo. Avida columns chadivithe avida ku avagahana leni vishayam undadu ani anipistundi. Avida samadhanalu chala vipulanga mariyu saralanga andariki ardham ayyela untayi. Telugu sahiti prapancham oka amoolyamaina vajranni kolpoyindi.......:(
     
    1 person likes this.

Share This Page