teacher: Vidyardhulu ekkuvuga vupayoginche vakyam emti cheppagalava? student: naku thelidhu teacher. teacher: very good!.... Foot ball match mida vyasam rayamante oka vidyardhi ila rasadu '' bhari.... varcham karanamga neti foot match vaiedha padindhi.''
hi frds kavya,indira,swati...me andari jokes chala chala bagunnayi baga navvukunnanu looking for more from u nenu cheppalenu kani meru cheppevi aswadistu vuntanu
నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను "ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?" "కాదు..... నన్ను తోసేస్తుందని."
చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు. "మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు. --------------------------------------------------------------------------------------------- ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు. "భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి. "నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.