Happy International Men's Day ( NOV 19th )

Discussion in 'Andhra Pradesh' started by mitrudu2012, Nov 19, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    International Men's Day








    InternationalMensDay2009.jpg






    intermendays11small.jpg

     
    Last edited: Nov 19, 2013
    1 person likes this.
    Loading...

  2. rajinitk4

    rajinitk4 IL Hall of Fame

    Messages:
    3,603
    Likes Received:
    3,223
    Trophy Points:
    308
    Gender:
    Female
    Happy International Mens Day andi Never knew mens day kuda undani thanks for letting us know.
     
    2 people like this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
  4. sumanrathi

    sumanrathi IL Hall of Fame

    Messages:
    2,997
    Likes Received:
    3,203
    Trophy Points:
    308
    Gender:
    Male
    Thanks for sharing cool to hear that we too are in part somewhere. I too this is the first time i am hearing.

    My hearty wishes to all men specially who are all playing major roll in IL"s and contributing our level best to the Women's society.
     
    1 person likes this.
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    కుమారుని గా , సోదరుని గా , స్నేహితుని గా , భర్త గా ,తండ్రి గా తన కుటుంబ , దేశ , విశ్వమానవాళికి తనవంతు సహాయసహకారాలు అందిస్తూ స్పూర్తి ప్రదాతగా నిలిచిన " మగ మహా రాజులకు " అందరికీ ప్రపంచ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు :)
     
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మగాడికీ ఓ రోజు :



    1960వ సంవత్సరంలో ఆయన తన నినాదాన్ని లోకం మొత్తానికి వినిపించేలా అరవాలని భావించి పత్రికలను ఆసరా చేసుకున్నాడు. పుంఖానుపుంఖాలుగా 'పురుషుల దినోత్సవం' ప్రాముఖ్యతను తెలుపుతూ వ్యాసాలు రాశాడు. విడిగా ప్రతులను ముద్రించి పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలో, పురుషుడికీ ఓ రోజును ఎందుకు కేటాయించాలో వివరించే ప్రయత్నం చేశాడు. అలా ఆయన అలుపెరగని ఉద్యమాన్ని చేపడుతూ తన తండ్రి పుట్టిన రోజైన నవంబర్ 19వ తేదీని అధికారికంగా 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం'గా ప్రకటించుకున్నాడు. మాతృదినోత్సవం ఉన్నప్పటికీ మహిళల కోసం మహిళా దినోత్సవం అనేది ఒక రోజు ఉన్నప్పుడు.. పురుషులకు మాత్రం ఎందుకు పురుషుల దినోత్సవం జరపకూడదనేది ఆయన వాదన. అలా తొలుత కరేబియన్ దీవుల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి పునాదులు పడ్డాయి. తొలి అధికారిక సమావేశం ... పురుషుల దినోత్సవం ఒకటుందని, కరేబియన్ దీవుల్లో ఈ దినాన్ని జరుపుకుంటున్నారన్న విషయం చుట్టుపక్కల ఉన్న ద్వీపాలకు వ్యాపించేందుకు చాలా కాలం పట్టింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్విరామంగా పురుషుల దినోత్సవంపై ప్రచారాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఏదైతేనేం 1993వ సంవత్సరంలో డాక్టర్ జెరోమ్ తీలోక్ సింగ్ నేతృత్వంలో వెస్టిండీస్ యూనివర్శిటీలో ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇద్దరంటే ఇద్దరే పాల్గొనడం విశేషం. ఆ తరువాత అమెరికా, కెనడా లాంటి అగ్రరాజ్యాలు ప్రపంచ పురుషుల దినోత్సవాన్ని గుర్తించడంతో 1999వ సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు పలు అంశాలపై సమావేశంలో చర్చలు జరుపుతూ వస్తున్నారు. నేటి పురుషుడు- అతని భవిష్యత్తు, పురుషుడి ఆరోగ్యం, పురుషుల ప్రత్యుత్పత్తి, పురుషుల గౌరవం, పురుషుల త్యాగం లాంటి అంశాలపై ఉన్నతస్థాయి అధికారులు, విద్యావంతులు చర్చలు జరిపారు. ఈసారిం 'పురుషులు, మగపిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా చిరకాలం జీవించాలి' అనే అంశంపై చర్చా సమావేశాలను నిర్వహించాలని తీర్మానించారు. పురుషుల ప్రాధాన్యతను తెలపడమే లక్ష్యంగా... లింగ వివక్ష వద్దు స్త్రీ, పురుషులు సమానం అంటూ గొంతు చించుకునే సమాజం పురుషుడి ప్రాధాన్యతను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్న ప్రశ్న నుంచే పురుషుల దినోత్సవం ఆవిర్భవించింది. గృహ హింసకు లోనయ్యే స్త్రీలను ఆదుకునేందుకు బోలెడు సంస్థలున్న నేపథ్యంలో అదే గృహహింసకు లోనయ్యే పురుషుడి ఆర్తనాదాలు వినే వారెవ్వరూ అంటూ ప్రశ్నించడం కోసం పుట్టుకొచ్చిందే ప్రపంచ పురుషుల దినోత్సవం. సమాజ నిర్మాణంలో, కుటుంబ వ్యవస్థ స్థిరత్వంలో, స్త్రీలకు భద్రతను కల్పించడంలో, బాల్యానికి భరోసా ఇవ్వడంలో అన్నింటా కీలక పాత్ర పోషిస్తున్న పురుషుడికీ ఓ రోజును కేటాయించాల్సిందేనని బల్లగుద్ది చెప్పాలన్న ఆవేశంలో నుంచి కళ్లు తెరిచిందే ఈ రోజు.
     
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male


    రోల్*మోడల్స్*... గోల్డెన్* ఫాదర్స్* :





    నేడు ఆడపిల్లల సంరక్షణలో తల్లితోపాటు తండ్రి కూడా ప్రముఖ పాత్ర వహిస్తు న్నాడు. ఆడపిల్లల ఆలనపాలనలో తల్లితో పాటు తండ్రి కూడా ముందుంటున్నాడు. ఒకప్పుడు పిల్లల పెంపకం, వారిని ఆలనపాలన అంతా తల్లిదే బాధ్యత అని భావిస్తుండేవారు. నేడు కాలం మారింది. దాంతో పాటు తండ్రులు కూడా తమ కూతుళ్లను చక్కగా పెంచి వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్నారు. తమ కూతుళ్లకు రోల్* మోడల్స్*గా నిలుస్తూ తామున్న రంగంలో వారిని కూడా పైకి తీసుకువస్తున్నారు. ఇటు వంటి వారిలో రాజకీయ రంగంలోనైతే జవహర్*లాల్* నెహ్రూ, బాబు జగ్జీవన్*రాంలను ఆదర్శంగా తీసుకుని వారి కూతుళ్లు ఇందిరాగాంధీ, మీరాకుమారీ ఉన్నత పదవుల్లో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. సినీ రంగాన్ని తీసుకుంటే ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్*బాబు, దక్షిణాది సూపర్*స్టార్* రజనీకాంత్*, విలక్షణ నటుడు కమల్*హాసన్* తమ కుమార్తెలు మంచు లక్ష్మీ ప్రసన్న, సౌందర్య,శ్రుతీహాసన్* లను సినీ రంగంలో ఉన్నత స్థానానికి తీసుకువచ్చేందుకు వారిని అన్ని విధాలా ప్రోత్సహించారు.

    ప్రపంచవ్యాప్తంగా నవంబరు 19న ప్రతి ఏటా అంతర్జాతీయ పురుషూల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1999లో ట్రిని డాడ్* అండ్* టొబాగోలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభిం చారు. నేడు కరేబియన్* దీవులతో పాటు ఆస్ట్రేలియా, అమె రికా, ఆసియా, యూరప్*, ఆఫ్రికా, నార్త్* అమెరికా దేశాలలో అంతర్జాతీయ పురుషూల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

    నెహ్రూ ఇందిరాగాంధీ:
    [​IMG]మనదేశ తొలి ప్రధాని జవహర్*లాల్* నెహ్రూ. ఆయన దేశ స్వాతం త్య్రోద్యమంలో మహాత్మాగాంధీతో కలిసి పాల్గొని దేశానికి స్వాతం త్రం తీసుకువచ్చేందుకు అహింసా మార్గంలో పారాడారు. నెహ్రూ భావి భారత దేశ నిర్మాణానికి బాటలు వేశారు. ఇక ఆయన కూతు రిగా ఇందిరా ప్రియదర్శిని గాంధీ దేశ ప్రధానిగా తనదైన ముద్రవే శారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రధానిగా 1966 నుండి 1977 వరకూవరుసగా మూడుసార్లు, 1980 నుంచి 84 వరకూ నాలుగవ సారి ప్రధానిగా కొనసాగారు. శ్రీలంక ప్రధానమంత్రి సిరి మావో బండారనాయకే తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డు సృష్టించారు. తన తండ్రి ప్రారంభించిన ప్రగతి విధానాలను ముందుకు కొనసాగించి దేశ అభివృద్ధికి ఆమె ఎంతో కృషిచేశారు. నాటి సోవియట్* యూని యన్*తో మన దేశానికి మంచి సంబంధాలను నెలకొల్పిన ఘనత ఆమెకు దక్కుతుంది.

    జగ్జీవన్*రాం మీరా కుమార్* :

    [​IMG]బడుగు వర్గాల నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్*రామ్*. బీహార్*కు చెందిన ఆయన ఆలిండియా డిప్రెస్డ్* క్లాసెస్* లీగ్*ను ప్రారంభించడంలో కీలకపాత్ర వహించారు. జవహర్*లాల్* నెహ్రూ ప్రభుత్వంలో యంగెస్ట్* మినిస్టర్* అయిన ఆయన తొలి కేంద్ర కార్మిక శాఖమంత్రి. బడుగులకు సాంఘిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన బాబు జగ్జీవన్*రాం తన కూతురు మీరా కుమారిని సైతం తన అడుగుజాడల్లో నడిపించారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 5సార్లు పార్లమెంట్* సభ్యురాలిగా ఎంపికకావడం విశేషం. దేశ తొలి మహిళా స్పీకర్*గా 2009 జూన్*3న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె నాటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. న్యాయవాది అయిన ఆమె 2004 నుంచి 2009 వరకూ కేంద్ర సాంఘిక సంక్షేమ, సాధికారికత మంత్రిగా బడుగులకు సాంఘిక న్యాయం జరిగేందుకు తన వంతు కృషిచేశారు.
     

Share This Page