Gouramma Festival (bathukamma బతుకమ్మ) Dassera Navarathri

Discussion in 'Pujas Prayers & Slokas' started by Teluguonline, May 15, 2016.

  1. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    Bathukamma Festival
    Dandiya (డాండియా, डांडिया) is a festival belongs to Gujarat. This is a way to worship Goddess Durga ma. In the same way Bathukamma festival is celebrated to worship Guori matha.
    Bathukamma is literally a celebration of life. It is a unique tribute to nature, which starts with colourful flowers and culminates in a water body. Divine fervour, floral beauty and songs encompass the ritual spirit of Bathukamma in all the nine days of its celebrations. Bathukamma is primarily a women's festival. It begins on the day of Bhadrapada / Mahalaya Amavasya and concludes on Durgashtami, based on the lunar calendar.

    బతుకమ్మ పండుగ
    ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్యతో మొదలై ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతుంది. పల్లెలు, పట్టణాలు, ఊరూ వాడా, దేశ విదేశాల్లో కూడా ప్రతి ఇంటి లోగిలీ ఓ పూలతోటగా పరిమళిస్తుంది. అమావాస్యతో ప్రారంభమై విజయ దశమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను నవ రాత్రులు అని కూడా అంటారు. ఆప్యాయతానురాగాలకు తోడుగా ఆధ్యాత్మికతను రంగరించే ఈ రంగుల పండుగ ప్రతి ఇంట్లో సంతోషాల పూలు పూయిస్తుంది. ఈ తొమ్మిది రోజులూ జిల్లాలోని పట్టణాలు, పల్లెలన్నీ వీనుల విందైన బతుకమ్మ పాటలతో మారుమోగుతాయి. ఈ పండుగలో గౌరమ్మ దేవిని ఆరాధించడం ఉంటుంది. ఇందులో ప్రతీ ఒక్కరూ పాల్గొనవచ్చు.
    దేశంలో అన్ని పండుగలూ కూడా కొద్ది పాటి తేడాతో అనేక చోట్ల జరుగుతాయి.ఉత్తర భారతదేశంలో డాండియా ఆడినా, దుర్గా మాతను పూజించినా, తెలంగాణాలో బతుకమ్మ ఆడినా అన్నీ ఆ శక్తిని కొలిచే మార్గాలే.
     

    Attached Files:

    pinkydarling and Lathasv like this.
    Loading...

  2. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    The festival begins a week before the grand ‘Saddula Batukamma’ (the grand finale of the Batukamma festival) which falls two days before Dussehra. The women folk normally get back to their parent's home from their in-laws and breathe the fresh air of freedom to celebrate the colors of flowers. For one complete week, they make small ‘Batukammas’, play around them every evening and immerse them in a nearby water pond. On the last day, the men folk of the house go into the wild plains and gather the flowers like gunuka and tangedi. They bring home bagfuls of these flowers and the entire household sits down to make the big ‘Batukamma’. The flowers are carefully arranged row after row in a brass plate (called taambalam) in circular rows and in alternate colors. As evening approaches the women folk dress colourfully with the best of their attire and adorn lot of ornaments and place the Batukamma in their courtyard. The women of neighborhood also gather in a large circle around it. They start singing songs by circling it repeatedly, building a beautiful human circle of unity, love, sisterhood.
    బతుకమ్మ

    సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మహిళలు స్నానమాచరించి కొత్త బట్టలు ధరించి ఇత్తడి పళ్ళెంలో లేదా సిబ్బిలో (సన్నని వెదురు బొంగులతో తయారు చేసిన ప్లేటు) మొదట గుమ్మడి ఆకును పేరుస్తారు. ఆ తర్వాత తంగేడు పూలు, గునుగు పూవు, బంతి, చామంతి, రుద్రాక్ష, నీలి గోరింట, సీతమ్మ జడ కుచ్చులు, కట్ల పూవు ఇలా రకరకాల రంగురంగుల పూలతో వీలైనంత ఎత్తుగా బతుకమ్మను పేరుస్తారు. సాయంత్రం కాగానే మహిళలందరూ తమ తమ బతుకమ్మలను తీసుకొని వాకిట్లో, వీధులలో లేదా ఆ ఊరి చెఱువు వద్దకు వెళ్ళి బతుకమ్మ చుట్టూ ఉయ్యాల మరియు కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతారు. తంగేడు ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి.
     

    Attached Files:

  3. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    Flowers used in Bathukamma
    Celosia
    Tanner's Cassia
    Marigold
    Chrysanthemum

    About Tanner's Cassia (తంగేడు పువ్వు)
    upload_2016-5-17_5-58-44.png

    Tanner’s Cassia is a 3-5 feet tall much-branched, hairy shrub with a reddish brown smooth bark. It belongs to the plant family Caesalpiniaceae. The leaves are 7.5-10 cm. long with a gland between each pair of leaflets. The 8-12 pairs of leaflets are 2-2.5 cm. long and slightly overlapping. They are oblong-obovate, and obtuse with numerous hairs. The flowers are large, reaching 5 cm. across in terminal and axilliary racemes. The pods are 7.5-12.5 cm. long, flat, thin, oblong, obtuse and deeply depressed between the 10-20 seeds. Researchers tell us that the extracts from the flowers of this shrub posses anti-hyperlipidaemic and anti-diabetic activities.
    MEDICINAL USE:

    • Diabetes, giddiness, weakness and insomnia.
    • Oedema in hands and legs.
    • Blood pressure and constipation.
    • Menorrhagia or excessive bleeding during menstruation.
    • Improvement of the complexion.
    • Burning sensation during urination and leucorrhea.
    • Eye diseases.

    HOW TO USE:

    • To take care of the first set of ailments under Medicinal use, make a decoction from the dry roots, bark, flowers, leaves and fruits. Take 1 teaspoon of this mixture with some hot water, 2 or 3 times a day for 2 to 3 months continuously.
    • For oedema in hands and legs, take one tablespoon each of Tanner’s Cassia bark and dried ginger and boil well in one cup of water till the volume is reduced to 2 tablespoons. Filter and drink.
    • To take care of the thirst set of ailments under Medicinal use, powder dry seeds and store. Before going to sleep every night, soak half a cup of Black Gram and a slice of fig in 2 glasses of water. The next morning, boil them till the volume of water is reduced to half. Strain and remove the solids. Then add half teaspoon powdered seeds of Tanner’s Cassia to filtrate and drink. Use for 2-3months continuously.
    • To relieve Menorrhagia, place some cleaned flowers into the vaginal canal for 10-15 minutes. Repeat frequently. Soak 2 tablespoons of fresh flowers in water for a few hours and drink. This improves the complexion.
    • The ease burning urination, mix half a teaspoon of the gum of this shrub in one cup of water and drink twice a day for several days.
    • In case of eye disease, fry some leaves in a little clarified butter or ghee. Cool and place them on the closed eyelids. Tie a bandage over it and rest for 10 minutes.

    PARTS USED:

    Bark, gum, flowers, fruits, leaves and roots.

    DOSE:

    As recommended above.


    బతుకమ్మ-పూలు (Flowers for Bathukamma)

    బతుకమ్మను వివిధ రంగుల పూలతో పేరుస్తారు. వానాకాలంలో భూమాత పూలపరిమళాలను వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా రంగురంగుల పువ్వులు కనువిందు చేస్తాయి. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను తీర్చిదిద్ది.. ప్రకృతితో అనుబందాన్ని చాటుకుంటారు మహిళలు. ఈ పండుగలో తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూల విశిష్టత ఎంతో ఉంది. వీటిలోని ఔషధగుణాలకు ఎంతో విలువ ఉంది.
    తంగేడు పూవు

    తంగేడు పూవును తుంగేర, గొబ్బి పూలు అని కూడా అంటారు. సంస్కృతంలో దీనికి చరమ రంగ, మాయహరి, పీఠ కిలక, తిమిరి హరి, ఆవర్తకి మొదలైన పేర్లు ఉన్నాయి. ఆంగ్లంలో దీనిని టానర్స్ కాషియా లేక టానర్స్ సెన్నా అనీ అంటారు. శాస్త్రీయంగా దీనికి కేషియా ఆరిక్యులేటా లేదా సెన్నా ఆరిక్యులేటా అని పేర్లు ఉన్నాయి. ఇది సీసాల్పినియేసి కుటుంబానికి చెందింది. ఈ మొక్క బెరడులో టాన్లి ఎక్కువగా ఉన్నాయి. మొక్క సమూలంలో బీటా సైటోస్టీరాల్, గ్లైకోసైడ్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత, కఫ హర గుణాలున్నట్టు పేర్కొంటారు. తంగేడులో చర్మ, క్రిమి, నేత్ర జబ్బులను తగ్గించే ఔషధ గుణాలున్నాయి. బ్యాక్టీరియాని నశింపజేసే గుణం ఉంది. తంగేడుతో గల మరిన్ని ప్రయోజనాలను క్రింద చూడండి.

    అతిమూత్రవ్యాధి - కాండం మీది బెరడుతో సమంగా, నువ్లు పిండి కలిపి, పూటకు ఒక చెంచాడు, రెండు పూటలా, ఒక మండలం రోజులు తీసుకుంటే, దీర్ఘకాలంగా వున్న అతిమూత్ర వ్యాధి నియంత్రించబడుతుంది. గుండెదడ - విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి, కాఫీ చేసుకుని త్రాగితే, గుండె దడ తగ్గడమే కాక, దానితో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతుంది.

    లేత అకులు గుప్పెడు తీసుకుని, రెండు చిటికెల గవ్వపలుకుల బూడిద కలిపి, టాబ్లెట్స్ లాగా చేసి రోజుకు రెండు కడుపులోకి తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి, సంతానం కలుగుతుందని గిరిజన వైద్యం చెబుతోంది. మధుమేహ వ్యాధితో కలిగే అతిమూత్రవ్యాధి నివారణకు, పూమొగ్గలతో తయారు చేసిన కషాయంలో తేనె కలుపుకుని తాగితే మంచిది.

    కుప్పం దగ్గరి తండాలలో గిరిజనులు, దీర్ఘకాలంగా వున్న తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరు బెరడు నూరి, ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు. గుప్పెడు పత్రాలు, రెండు శేర్ల నీటిలో వేసి కషాయం కాచి, దాన్లో బాగా కాల్చిన రెండు ఇటుకరాళ్లు వేసి, దాంట్లో నుంచి వచ్చే ఆవిరిని, కణతలకు, ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.

    రేచీకటి తగ్గడానికి, పత్రాల రసం తీసి, దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి, మండలం రోజులు, ఒక మోతాదు తీసుకుంటే, రాత్రిపూట చూపు మెరుగవుతుంది. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది.

    విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడ్తారు. విరిగిన లేక బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి, కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి, పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు పడకుండా త్వరగా అతుక్కుంటుంది, ఈ రకమైన వైద్యంలో తంగేడుతో కూడా కసింధ అనే మొక్క ఆకు కూడా ఎక్కువగా వాడుతారు.

    నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు పత్రాలు నూరి మాత్రలుగా చేసి ఇస్తే, వారం రోజులకు పూత, పుండు తగ్గుతుంది.
     
  4. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    గునుగు పూవు (Complete details at Celosia - Wikipedia, the free encyclopedia )

    [​IMG]


    గునుగు రక్తవిరోచనాలు అరికడుతుంది. చర్మంపై పొక్కులు, గాయాలు, క్షయ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. లేత కొమ్మలు, ఆకులు, గింజలు మంచి ఆహారం. ఇవి సగం తెలుపు రంగులో ఉంటాయి. వీటిని చిన్న చిన్న కట్టలు కట్టలుగా కట్టి వివిధ రంగులలో ముంచి బతుకమ్మను పేర్వడానికి ఉపయోగిస్తారు
     
  5. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    గుమ్మడి (Used in making Bathukamma)
    upload_2016-5-23_6-52-34.png
    For medicinal values please visit
    Medicinal properties of pumpkin
    పువ్వులలో, కాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొట్టలో క్రిములను సంహరిస్తుంది. శరీరానికి వేడిని అందిస్తుంది.
     
  6. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    మందారం

    జ్వరాలు, గుండె జబ్బులు, సెగగడ్డలు, వ్రణముల నివారణ ఉపయుక్తంగా ఉంటుంది. శిరోజాలు నల్లగా, వత్తుగా ఉండేలా చేస్తుంది.

    సీతమ్మవారి జడబంతి/పట్టుకుచ్చు పూలు

    ఆకులు గాయాలకు, నోటిలో పొక్కులకు ఉపయుక్తంగా ఉంటాయి. అందమైన పూలమొక్క. గింజలు పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.

    గన్నేరు

    కఫాన్ని, వాతాన్ని నివారిస్తుంది. కుష్టు వ్యాధి నివారణకు పనిచేస్తుంది. చుండ్రు, వ్రణముల బాధ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

    మోదుగ

    ఈ ఆకులను ఆహారంగా తీసుకున్న ఆవులు ఎక్కువ పాలిస్తాయి. పొట్టలో క్రిములకు, చర్మ సమస్యలకు, పైల్స్‌ నివారణకు పని చేస్తుంది. విషకాటుకు విరుగుడు.

    బొగడ / బతుకమ్మ గడ్డిపూలు

    రంగు పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. పూల రంగు ఎక్కువ రోజుల మన్నుతుంది. వేరు కషాయం దగ్గు నివారణిగా పనిచేస్తుంది.

    చామంతి

    శరీరానికి చలువ చేయడమే కాకుండా జ్వరం, తాపం, అగ్నిమాంద్యము వంటి వ్యాధుల నుంచి ఉపశమనానికి పనిచేస్తుంది. చక్కని సువాసనను ఇస్తుంది.

    కట్లపూలు

    నీలి ఆకాశ రంగులో పూలు పూస్తుంది. పూలు కంటికి ఇంపుగా ఉంటాయి. చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి.

    నందివర్ధనం

    కాండంలో పాలలాంటి లేటెక్స్‌ ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. వాపులు, నొప్పులకు నివారణిగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

    కనకాంబరం

    ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పువ్వుల నుంచి సహజ రంగులను తీస్తారు. నారింజ, పసుపు రంగుల్లో పూస్తుంది.

    బంతిపూలు

    వ్యాధి ప్రతిరక్షక గుణాలుంటాయి. వ్యాధి నిరోధక, క్రిమి నిరోధక ఔషధంగా పనిచేస్తుంది. పువ్వుల నుంచి పసుపు రంగు తీస్తారు.

    తామరపుష్పం

    దగ్గు, చర్మ వ్యాధులు, అతిసారం, జిగట విరేచనాల నివారణకు పనిచేస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది.

    బతుకమ్మ- కథలు

    చోళ దేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరు మంది సంతానం. అందరూ శత్రువుల చేతుల్లో మరణిస్తారు. ధనం, రాజ్యం, పుత్ర సంపద అంతా పోతుంది. ఆ దంపతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సత్యవతి లక్ష్మీదేవిని గూర్చి తపస్సు చేసింది. ఆ తల్లి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అందుకు సత్యవతి, లక్ష్మిని ఆమె గర్భంలో చేరి, జన్మించమని కోరింది. శ్రీ లక్ష్మి అలాగే చేసి, జన్మించింది. మునులు, కవులు, గాయకులు వచ్చి ఆ పాపను చూసి ‘బతుకమ్మ’ అని పిలిచారు. ఆ పాపకు తల్లి దండ్రులు ఆ పేరే ఖాయం చేశారు. శ్రీ మహా విష్ణువు చక్రాంకుడనే పేర జన్మనెత్తి ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతన్ని బతుకమ్మ పెళ్లి చేసుకోగా.. ఆరువేల మంది సుందరాంగులు జన్మించారు.

    ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

    ఇక మరొక కథ. ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా ... పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు.

    బతుకమ్మ- నైవేద్యాలు

    తొమ్మిది రోజులు కూడా తొమ్మిది వేరు వేరు రకాల నైవేద్యాలు బతుకమ్మకు సమర్పిస్తారు. అందులో తులసి ఆకులు, వక్కలు, వెన్న ముద్దలు, సప్పిడి పిండి, నువ్వు పొడి, పెసరపొడి, పులిహోర, పెరుగన్నం, నానబియ్యం, బెల్లం, నువ్వులు బెల్లం ముద్ద ఇలా ఎన్నో నైవేద్యాలు పెడుతారు. ఈ నవ రాత్రులలో పెట్టే తొమ్మిది రకాల సద్దులు అమ్మవారికి అన్ని నైవేద్యాలన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనవి.

    మహాలయ అమావాస్య (పెత్రమాస) రోజు ఆడే బతుకమ్మను 'ఎంగలి పూబతుకమ్మా' అంటారు. ఆనాటి నుండి బతుకమ్మ పండగ మొదలవుతుంది.

    తొలిరోజు: నానబెట్టిన పెసరపప్పు, కీర(దోసకాయ) ముక్కలు, పాయనం, గారె బొండలు ఇంట్లో పితృ దేవతలకు పెడతారు. కనుక, ఆ గారె బొండలు కూడా నైవేద్యం పెట్టడంతో, అంటే పలు బంధుమిత్రులందరికీ పెట్టినాక మిగిలినవి పెడతారు. కనుక 'ఎంగిలి పూబతుకమ్మా' అంటారు. పెసర్ల పంట అప్పుడే వస్తుంది. కనుక కొత్త పప్పును నైవేద్యానికి వాడుతారు.

    రెండో రోజు: నువ్వుల లడ్డు. నువ్వులను గోలించి పెట్టుకుంటారు. తర్వాత బెల్లం కరిగెంత నీళ్ళు పోసి, తారు పాకం వచ్చాక నువ్వులను కలిపి లడ్డూలా కడ్తారు. ఇది రెండవ రోజు నైవేద్యం.

    మూడవ రోజు: సేవ లడ్డు. సైదం(గోధుమపిండి) రొట్టెల పిండిలా కలిపి, పీటమీద నూనె చేతికి రాసుకుని సేవలు తాలుస్తారు. తాల్చిన సేవలను నూనెలో గోలించి, చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుంటారు. బెల్లం పాకం పట్టి ఈ ముక్కలు కలిపి లడ్డులులా కడతారు. ఇది మూడో రోజు నైవేద్యం.

    నాల్గవ రోజు: బియ్యపు పాయసం. బియ్యాన్ని నేతిలో వేయించి అన్నం వండి మెత్తగా చేసి పాలు, చక్కర, యాలకుల పొడి వేసి పాయసం చేస్తారు. దూస బియ్యంతో చేస్తే మరీ మంచిది.

    ఐదవ రోజు: పచ్చి పిండి. బియ్యపు పిండితో చక్కెర, పాలు, యాలకుల పొడి, కలిపి ఉండ్రాళ్లంత గుండ్రంగా కట్టి నైవేద్యం పెడతారు.

    ఆరవ రోజు: ఈ రోజు గౌరమ్మ దేవికి అటుకులతో పాయసం నైవేద్యంగా పెడుతారు.

    ఏడవ రోజు: నవ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో పలహారం.

    ఎనిమిదవ రోజు: పెసర సద్ది. అన్నం వండి దానిలో పెసర పిండి కలిపి నైవేద్యం పెడుతారు.

    తొమ్మిదవ రోజు:సద్దులు. దీనినే సద్దుల బతుకమ్మ అంటారు. ఇవి ఏడు రకాలు. పెసరపిండి ముద్దలను నైవేద్యం పెడతారు. పులిహోర(చిత్రాన్నం), పెరుగన్నం(దద్దోజనం), బెల్లపన్నం(గుడాన్న ప్రియ), పులగం(పెసరపప్పు, బియ్యంతో కలిపి వండిన వంటకం), కిచిడి(కూరగాయలతో వండిన వంటకం), అన్నం పాయసం, కొబ్బరన్నం.

    ఇలా అన్నాన్ని అనేక రకాలుగా వండి దొప్పల్లో పెడతారు.

    తెలంగాణలో ప్రత్యేకమైన అమ్మవారి నైవేద్యం బతుకమ్మ ముద్దలు లేక పెసరపిండి ముద్దలు.

    (ముంగదాల్‌, ముదాల్‌పిండి): పెసరపప్పును దోరగా గోలించి మెత్తగా పిండి చేస్తారు. చక్కెరను మెత్తగా పొడిచేసి మంచి నెయ్యి పోసి ముద్దలు(లడ్డూలు) కడతారు. బతుకమ్మకు ప్రియమైన నైవేద్యంగా దీనిని నివేదిస్తారు.

    నువ్వుల సద్ది : కావలసినవి : 1కేజీ బియ్యం, 1/4 కేజీ నువ్వులు, పల్లీలు, పోపుగింజలు, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తాలింపుకు తగినంత నూనె, చిటికెడు ఇంగువ, కరివేపాకు నాలుగు రెమ్మలు, చిటికెడు పసుపు.

    తయారు చేసే విధానం: ముందుగా నువ్వులను దోరగా వేయించి చల్లార్చి, పొడిచేసి పెట్టుకోవాలి. తర్వాత అన్నం వండి ఒక వెడల్పాటి బేసిన్‌లో చల్లార్చి పెట్టుకోవాలి. అన్నాన్ని, నువ్వుల పొడిని కలిపి అందులో ఉప్పు, పసుపు వేయాలి. తర్వాత ఒక మూకుడులో తగినంత నూనెవేసి కాగిన తర్వాత ఎండు మిర్చి, తాలింపుగింజలు, పచ్చిమిర్చి, పల్లీలు, ఇంగువ, కర్వేపాకు వేసి చల్లార్చిన అన్నాన్ని పోపు పెట్టి బాగా కలిపాలి.

    సాయంత్రం కాగానే మహిళలందరూ తమ తమ బతుకమ్మలను తీసుకొని వాకిట్లో, వీధులలో లేదా ఆ ఊరి చెఱువు వద్దకు వెళ్ళి బతుకమ్మ చుట్టూ ఉయ్యాల మరియు కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతారు.

    బతుకమ్మ పాటలు

    బతుకమ్మ పాటలలో ప్రజల జీవన శైలి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆడ వారి కష్టసుఖాలు గురించి మరియు పెళ్ళైన తర్వాత ఇంట్లోని పెద్దవారితో మెలిగే తీరు ఇలా సంస్కృతీసాంప్రదాయాలు కన్నులకు కట్టినట్టుగా పాడుతారు. కుటుంబ జీవితంలోని సంతోషాన్ని, పిల్లల ముద్దూ ముచ్చెట్లూ, పంటచేల వయ్యారాలు, వీరుల త్యాగాలు, దేవతల కథలు బతుకమ్మ పాటలలో కలగలిపి పాడుతారు. పాటలు లయబద్ధంగా ఉంటాయి. ఆ లయకు తగ్గట్టుగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉయ్యాల వంగడం ఒక కళ.
     
  7. Teluguonline

    Teluguonline Silver IL'ite

    Messages:
    43
    Likes Received:
    88
    Trophy Points:
    65
    Gender:
    Female
    Even though I live in Bangalore, we celebrated 2015 Bathukamma, the very first time in Bengaluru history. We played Dandiya and bathukamma. Great joy...worshipping Goddess durga maa.
     
  8. Rajchappeta

    Rajchappeta New IL'ite

    Messages:
    16
    Likes Received:
    1
    Trophy Points:
    1
    Gender:
    Male
  9. Rajchappeta

    Rajchappeta New IL'ite

    Messages:
    16
    Likes Received:
    1
    Trophy Points:
    1
    Gender:
    Male

Share This Page