శ్రీ శ్రీ ( జయంతి/ Bithday: 30 April 1910 )

Discussion in 'Andhra Pradesh' started by mitrudu2012, Apr 30, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    శ్రీ శ్రీ జయంతి : ( 30 ఏప్రిల్ )



    220px-Srisri.jpg


    శ్రీశ్రీ (శ్రీరంగంశ్రీనివాసరావు)గారిపేరుఎరుగనితెలుగువాడుఉండడంటే
    అతిశయోక్తి
    కాదు.రాజవీధుల్లోనూ,పండితులచర్చాగోష్టుల్లోనూ,
    రాజ
    దర్బారుల్లోనూమాత్రమేవెలుగుతున్నతెలుగుసాహితీసౌరభాల్ని,
    సామాన్యుడి
    చెంతకూ,మట్టివీధులవరకూ..తీసుకొచ్చినమహాకవిగాశ్రీశ్రీపేరుతెలుగుభాష,
    తెలుగు
    జాతిఉన్నంతకాలంచరిత్రలోవెలుగుతూనేఉంటుంది.
    తెలుగుసాహిత్యంలోసామాన్యుడికష్టనష్టాలగురించీ,పేదసాదలజీవితాలని
    ప్రతిబింబించే
    కవిత్వాన్నిరాసినమొదటికవిగాఆయనఆంధ్రులందరికీచిరస్మరణీయుడు.

    ఆయనరచనల్లో1950లోప్రచురించబడిన'మహాప్రస్థానం'అనేకవితాసంపుటి
    తెలుగు
    సాహితీఅభిమానులమనసుల్లోనేకాకుండా..సామాన్యప్రజల
    గుండెల్లో
    కూడాచిరస్థాయిగానిలిచిపోతుంది.



    ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు.విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని
    ధిక్కరించినవాడిగా, అభ్యుదయరచయితల సంఘం అధ్యక్షుడిగా,
    విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా,సినిమా పాటల రచయితగా
    ఆయన ప్రసిద్ధుడు.మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు.

    "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి,
    ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు.
    ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది" అన్న బూదరాజురాధాకృష్ణ గారి
    మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు
    .

    జీవనగమనం:

    1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకుజన్మించాడు.
    శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది.




    1935 లో విశాఖ లోని మిసెస్* ఎ వి ఎస్* కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్* ఎడిటరు గా చేరాడు. ఆ తరువాతఆకాశవాణి,
    ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ
    ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం,
    జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి
    మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు.తెలుగు సాహిత్యపు దశనూ,
    దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు.
    తన రచనా వ్యాసంగాన్నికొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు.
    ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు.

    1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది.
    ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం)ఏర్పడింది.

    సాహితీ
    వ్యాసాంగం:

    శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు.
    తన 18 వ ఏట 1928 లో"ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించారు.
    ఈరచనను సాంప్రదాయపధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలోసాంప్రదాయికమైన
    గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో
    కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడఅని ఆయన అన్నారు .
    1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది.మహాప్రస్థానం,
    జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైనకవితల సంపుటి అది.
    ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని
    మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను,
    చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు.
    మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తోరాసినవే అయినా అవి రాసేనాటికి
    మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్* లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీస్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య
    గీతాలక్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన
    ఈ విషయంస్వయం గా రాసాడు. అందులో ఇలా రాసాడు:
    "..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజికవాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికతఒకటి ఉందనీ
    అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగిచూసుకుంటే,
    మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహాయాదృఛ్ఛికాలు కావని
    స్పష్టంగా తెలుస్తోంది."తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను
    ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీరలేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
    రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాసాడు.ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు.
    అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తరవాక్యమే! శబ్ద ప్రయోగంలో
    నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రిక లోప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకుసమాధానాలిచ్చే శీర్షిక అది.
    చతురోక్తులతో, శ్లేష లతో కూడిన శీర్షిక బహుళప్రాచుర్యం పొందింది.
    'మహాప్రస్థానం'పుస్తకంలోనిచాలాకవితలనుశ్రీశ్రీగారు1930-40
    మధ్య
    కాలంలోవ్రాసారట.మహాప్రస్థానాన్నిశ్రీశ్రీగారుఆయనమిత్రుడు
    శ్రీ
    కొంపెల్లజనార్ధనరావుగారికిఅంకితంచేసారు.అంకితవాక్యాలుకూడాకవితా
    రూపంలోనే
    స్వయంగాశ్రీశ్రీనేవ్రాశారు.పోస్టులోకవితనుఇస్తున్నాను.
    చూడండి
    మీరే..వారిస్నేహబంధాన్ని..!



     
    Last edited: Apr 30, 2013
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మహా ప్రస్థానం : ( మరో ప్రపంచం )





    మరో ప్రపంచం,
    మరో ప్రపంచం పిలిచింది!
    పదండి ముందుకు,
    పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం పైపైకి!

    కదం త్రొక్కుతూ,
    పదం పాడుతూ,
    హ్రుదంత రాళం గర్జిస్తూ-
    పదండి పోదాం,
    వినబడలేదా
    మరో ప్రపంచం జలపాతం?

    దారి పొడుగునా గుండె నెత్తురులు
    తర్పణ చేస్తూ పదండి ముందుకు!
    బాటలు నడిచీ,
    పేటలు కడచీ,
    కోట లన్నిటిని దాటండి!
    నదీ నదాలు,
    అడవులు, కొండలు,
    ఎడారులా మన కడ్డంకి?
    పదండి ముందుకు!
    పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం, పైపైకి!

    ఎముకుల కుళ్ళిన,
    వయస్సు మళ్ళిన
    సోమరులారా! చావండి!
    నెత్తురు మండే,
    శక్తులు నిండే
    సైనికులారా! రారండి!
    “హరోం! హరోం హర!
    హర! హర! హర! హర!
    హరోం హరా!” అని కదలండి!

    మరో ప్రపంచం,
    మహా ప్రపంచం
    దరిత్రినిండా నిండింది!
    పదండి ముందుకు!
    పదండి త్రోసుకు!
    ప్రభంజనంవలె హోరెత్తండీ!
    భావ వేగమున ప్రసరించండీ!
    వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
    పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
    పదండి,
    పదండి,
    పదండి ముందుకు!
    కనబడ లేదా మరో ప్రపంచపు
    కణకణ మండే త్రేతాగ్ని?

    ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
    ఎనభై లక్షల మేరుపులు!
    తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
    జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
    సల సల క్రాగే చమురా? కాదిది,
    ఉష్ణరక్త కాసారం!
    శివసముద్రమూ,
    నయాగరావలె,
    ఉరకండీ! ఉరకండీ ముందుకు!
    పదండీ ముందుకు!
    పదండీ త్రోసుకు!
    మరో ప్రపంచపు కంచు నగారా
    విరామ మెరుగక మ్రోగింది!

    త్రాచులవలెనూ,
    రేచులవలెనూ,
    ధనంజయునిలా సాగండి!
    కనబడ లేదా మరో ప్రపంచపు
    అగ్ని కిరీటపు ధగధగలు,
    ఎర్రబావుటా నిగనిగలు,
    హోమజ్వాలల భుగ భుగలు ?


     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    జగన్నాథుని రథచక్రాలు

    జగన్నాథుని రథచక్రాలు

    పతితులార!
    భ్రష్టులార!
    బాధాసర్పదష్టులార!
    బ్రదుకు కాలి,
    పనికిమాలి,
    శనిదేవత రథచక్రపు
    టిరుసులలో పడి నలిగిన
    దీనులార!
    హీనులార!
    కూడులేని,
    గూడులేని
    పక్షులార! భిక్షులార!
    సఖులవలన పరిచ్యుతులు,
    జనులవలన తిరస్కృతులు,
    సంఘానికి బహిష్కృతులు-
    జితాసువులు,
    చ్యుతాశయులు,
    హృతాశ్రయులు,
    హతాశులై
    ఏడవకం డేడవకండి.
    మీ రక్తం కలగి కలగి
    మీ నాడులు కదలి కదలి
    మీ ప్రేవులు కనలి కనలి
    ఏడవకం డేడవకండి,
    ఓ వ్యథానివిష్టులార!
    ఓ కథావశిష్టులార!
    పతితులార!
    భ్రష్టులార!
    బాధాసర్పదష్టులార!
    ఏడవకం డేడవకండి!

    వస్తున్నాయొస్తున్నాయి….
    జగన్నాథ,
    జగన్నాథ,
    జగన్నాథ రథచక్రాల్!
    జగన్నాథుని రథచక్రాల్!
    రథచక్రాల్,
    రథచక్రాల్,
    రథచక్రాల్, రథచక్రా
    లొస్తున్నా యొస్తున్నాయి!



    పతితులార!
    భ్రష్టులార!
    మెయిల్దారిని
    బయల్దేరిన
    రథచక్రాల్, రథచక్రా
    లొస్తున్నా యొస్తున్నాయి!



    సింహాచలం కదిలింది,
    హిమాచలం కరిగింది,
    వింధ్యాచలం పగిలింది-
    సింహాచలం,
    హిమాచలం,
    వింధ్యాచలం, సంధ్యాచలం….
    మహానగా లెగురుతున్నాయి!
    మహారథం కదులుతున్నాది!
    చూర్ణమాన
    ఘూర్ణమాన
    దీర్ణమాన గిరిశిఖరాల్
    గిరగిరగిర తిరుగుతున్నాయి!
    పతితులార!
    భ్రష్టులార
    బాధాసర్పదష్టులార!
    రారండో! రండో! రండి!



    ఊరవతల నీరింకిన
    చెరువుపక్క, చెట్టునీడ-
    గోనెలతో, కుండలతో,
    ఎటుచూస్తే అటు చీకటి,
    అటు దుఃఖం పటునిరాశ-
    చెరసాలలు, ఉరికొయ్యలు,
    కాలువలో ఆత్మహత్య!
    దగాపడిన తమ్ములార!
    మీ బాధలు నే నెరుగుదును….
    వడలో, కడు
    జడిలో, పెను
    చలిలో తెగనవసి కుములు
    మీ బాధలు, మీగాథలు
    అవగాహన నాకవుతాయి!
    పతితులార!
    భ్రష్టులార!
    దగాపడిన తమ్ములార!
    మీకోసం కలం పట్టి,
    ఆకాశపు దారులంట,
    అడావుడిగ వెళిపోయే,
    అరచుకుంటు వెళిపోయే
    జగన్నాథుని రథచక్రాల్!
    రథచక్ర ప్రళయ ఘోష
    భూమార్గం పట్టిస్తాను!
    భూకంపం పుట్టిస్తాను!

    నట ధూర్జటి
    నిటాలాక్షి పగిలిందట!
    నిటాలాగ్ని రగిలిందట!
    నిటాలాగ్ని
    నిటాలార్చి!
    నిటాలాక్షి పటాలుమని
    ప్రపంచాన్ని భయపెట్టింది!
    అరె ఝాఁ! ఝాఁ!
    ఝటక్, ఫటక్ ….
    హింసనచణ
    ధ్వంసరచన
    ధ్వంస నచణ
    హింస రచన!
    విషవాయువు, మరఫిరంగి
    టార్పీడో, టోర్నాడో!
    అది విలయం,
    అది సమరం,
    అటో యిటో తెగిపోతుంది!

    సంరంభం,
    సంక్షోభం,
    సమ్మర్దన, సంఘర్షణ!
    హాలాహలం పొగచూరింది!
    కోలాహలం చెలరేగింది!
    పతితులార!
    భ్రష్టులార!
    ఇది సవనం,
    ఇది సమరం!
    ఈ యెగిరిన ఇనుప డేగ,
    ఈ పండిన మంట పంట,
    ద్రోహాలను తూలగొట్టి,
    దోషాలను తుడిచిపెట్టి,
    స్వాతంత్ర్యం,
    సమభావం,
    సౌభ్రాత్రం,
    సౌహార్దం
    పునాదులై ఇళ్ళులేచి,
    జనావళికి శుభం పూచి-
    శాంతి, శాంతి, కాంతి, శాంతి
    జగమంతా జయిస్తుంది,
    ఈ స్వప్నం నిజమవుతుంది!
    ఈ స్వర్గం ఋజువవుతుంది!
    పతితులార!
    భ్రష్టులార!
    బాధాసర్పదష్టులార!
    దగాపడిన తమ్ములార!
    ఏడవకం డేడవకండి!
    వచ్చేశాయ్, విచ్చేశాయ్,
    జగన్నాథ,
    జగన్నాథ,
    జగన్నాథ రథచక్రాల్,
    జగన్నాథుని రథచక్రాల్,
    రథచక్రాల్,
    రథచక్రాల్,
    రథచక్రాల్, రథచక్రాల్,
    రారండో! రండో! రండి!
    ఈలోకం మీదేనండి!
    మీ రాజ్యం మీరేలండి!
     

Share This Page