మొక్కజొన్నవడలు

Discussion in 'Hyderabad' started by rangalakshmi, Oct 15, 2012.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    కావలసిన పదార్థాలు: మొక్కజొన్నలు(పచ్చివి) - అరకిలో, పచ్చిమిరపకాయలు - ఆరు, ఉల్లిపాయలు - రెండు, అల్లం - 50 గ్రాములు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

    తయారుచేయు విధానం: మొక్కజొన్నలు ఎండినవైతే ముందు రోజు రాత్రి నీళ్లల్లో నానబెట్టుకోవాలి. పచ్చివయితే అలాగే రుబ్బుకోవాలి. ఉల్లి పాయల్ని, పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కోసి రుబ్బిన పిండిలో వేసుకోవాలి. అల్లాన్ని కూడా సన్నగా తరిగి ఇందులో వేయాలి.

    చివరిగా సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి బాగా కాగాక ఈ పిండితో వడలుగా వేసుకోవాలి. ఈ వడలు వేడిగా తింటేనే బాగుంటాయి.

    MY BLOG-http://blossomera.blogspot.com
     
  2. saras123

    saras123 IL Hall of Fame

    Messages:
    3,395
    Likes Received:
    2,093
    Trophy Points:
    315
    Gender:
    Female
    Thanks Rangalakshimi garu for your tasty recipe.
    will try this during dassera.

     

Share This Page