పెరుగు వడ

Discussion in 'Hyderabad' started by rangalakshmi, Oct 16, 2012.

  1. rangalakshmi

    rangalakshmi Bronze IL'ite

    Messages:
    51
    Likes Received:
    26
    Trophy Points:
    38
    Gender:
    Female
    కావలసిన పదార్దములు :
    గట్టి పెరుగు: 1ltr
    మినపప్పు: 1/2kg
    ఉప్పు: రుచికి సరిపడా
    నూనె: వేయించడానికి సరిపడా
    పోపుదినుసులు: 1tsp
    ఎండిమిర్చి: 4-6
    కరివేపాకు: రెండు రెమ్మలు
    పసుపు: చిటికెడు
    వంటసోడా: చిటికెడు
    కొబ్బరి ముక్కలు: 1/4cup
    అల్లం ముక్కలు లేదా అల్లం తురుము: 2tbsp
    పచ్చిమిర్చి తరుగు: 4-6
    తయారుచేయు విధానం :
    మినపప్పును నాలుగు గంటలు ముందు నానబెట్టాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా వేడిచేసి పోపుదినుసులు వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దించి పెరుగులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పప్పును శుభ్రంగా కడిగి మెత్తగా గట్టిగా రుబ్బాలి. దీనిలో ఉప్పు, సోడా, కొబ్బరి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు కలపాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత రుబ్బిన పిండిని గారెలు లాగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసి, పోపువేసిన పెరుగులో వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల గారెలు పెరుగును పీల్చుకుంటాయి. దాంతో పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి...
    MY BLOG-http://blossomera.blogspot.com
     
    Loading...

Share This Page